తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వేణు మాధవ్

తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనబడుతోంది. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నల్లగొండ జిల్లాలోని కోదాడ నియోజకవర్గం నుంచి వేణు మాధవ్ పోటీ చేస్తున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం లేదని, స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నామినేషన్ దాఖలు చేశారు.

Venu Madhav to contest Telangana elections

వేణు మాధవ్ తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే మహాకూటమి పొత్తుల కారణంగా ఆయనకు అవకాశం లభించక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోని దిగినట్లు చర్చించుకుంటున్నారు.

ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడిపిన వేణు మాధవ్.... ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేశారు. ప్రస్తుతం ఆయన తన ఫోకస్ పొలిటికల్ కెరీర్ మీద పెట్టినట్లు తెలుస్తోంది. మరో కమెడియన్ బాబూ మోహన్ ఆందోళ్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X