వేణుమాధవ్ మృతికి అసలు కారణమిదే.. టార్గెట్ చేసింది వాళ్లే.. క్లారిటీ ఇచ్చిన తనయులు
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న నటుడు వేణు మాధవ్. ఆయన మరణించి ఏడాది గడిచింది. ఇక వారి కుటుంబ సభ్యులు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయంపై ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా నాన్న ఆరోగ్యం విషయంలో పొలిటికల్ సైడ్ నుంచి టార్గెట్ చేశారని వేణుమాధవ్ తనయులు వివరణ ఇచ్చారు.

అందువల్లే ఆరోగ్యం క్షిణీంచింది
వేణు మాధవ్ ఎక్కువగా తాగడం వల్లనే ఆరోగ్యం చెడిపోయిందని వస్తున్న రూమర్స్ పై కూడా వారు వివరణ ఇచ్చారు. ఆయన చివరి శ్వాస వరకు కూడా మాతో సంతోషంగానే ఉన్నారు. కానీ డైట్ విషయంలో కాస్త కంట్రోల్ ఎక్కువ కావడం వలన ఎఫెక్ట్ పడింది. డ్రింక్ అలవాటు ఉండేది. అయితే దాని వల్ల కాకుండా డైట్ వల్లే ఆయన అస్వస్థతకు గురయ్యారు.

ఆరోగ్యం బాగోలేదని బాధపడేవారు కాదు
అలాగే డెంగ్యూ ఫీవర్ వల్ల కూడా ఊపిరితిత్తులు కాస్త దెబ్బతిన్నాయి. హాస్పిటల్ లో తొందరగా జాయిన్ కాకపోవడం వలన కూడా ఆయన పరిస్థితి కొంచెం సీరియస్ అయ్యింది. ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగోలేదని బాధపడేవారు కాదు. వీలైనంత వరకు మాతో సంతోషంగా ఉండేవారు. రెగ్యులర్ గా చాలా మంది ఆయనను కలుస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా బయట విషయాలను ఇంట్లోకి తీసుకు వచ్చేవారు కాదు.

పొలిటికల్ గా టార్గెట్ చేశారు
ఇక అప్పట్లో వేణు మాధవ్ ఆరోగ్యంపై అనేక రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయంపై వేణు మాధవ్ కూడా సీరియస్ అయ్యారు. అయితే రూమర్స్ అలా స్ప్రెడ్ చేయడానికి కారణం ప్రత్యర్థి పొలిటికల్ నాయకులే అని పెద్ద కుమారుడు ప్రభాకర్ తెలియజేశాడు. అది కొంచెం బాధగా అనిపించింది గాని ఇంట్లో ఎప్పుడు కూడా పెద్దగా పైకి చూపించేవారు కాదని అన్నాడు.
Recommended Video

ఫ్యూచర్ పై క్లారిటీ ఇచ్చిన కుమారులు
ఇక తండ్రి కోరిక మేరకు పాలిటిక్స్ లో కొనసాగాలని ఉందని కుమారులు వివరణ ఇచ్చారు. తమ కుటుంబంలో ఎవరైనా ఒకరు పాలిటిక్స్ లో ఉండాలని వేణు మాధవ్ చెబుతుండేవారని సతీమణి తెలియజేశారు. ఇక నాన్న మరణించిన తరువాత చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు కలిశారని, చిరంజీవి గారు కూడా వచ్చి తమతో మాట్లాడారని తనయులు చెప్పారు.

ఇండస్ట్రీలో మోసం చేశారా?
అయితే ఇండస్ట్రీలో కొంతమంది వేణుమాధవ్ ని టార్గెట్ చేశారని కూడా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఆ విషయాలపై కూడా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా అన్నారు. ఆయనకు సినిమా ఇండస్ట్రీలో అందరు కూడా మంచి మిత్రులే ఉన్నట్లు చెప్పిన సతీమణి 2015వరకు కూడా సినిమాల తో బిజీగా ఉండేవారని అన్నారు. సినిమాలు తగ్గిన తరువాత కూడా ఇండస్ట్రీ వాళ్ళు కలుస్తూ ఉండేవారని చెప్పారు.

ఏ పార్టీలో జాయిన్ అవుతారు?
పొలిటికల్ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని కనీసం కార్పోరేట్ లెవెల్లో అయిన ట్రై చేస్తామని కుమారులిద్దరు కూడా వివరణ ఇచ్చారు. అయితే ఏ పార్టీలో జాయిన్ అవుతారనే విషయంపై స్పందిస్తూ.. ప్రజలకు సేవ చేయడానికి ఏ పార్టీలో అయినా చేరతామని అన్నారు. అయితే తెలంగాణలో టీడీపీ హవా లేనందున అటు సైడ్ వెల్లకపోవచ్చని, టీఆరెస్ నుంచి పిలుపు వస్తే తప్పకుండా వెళతామని వేణుమాధవ్ సతీమణి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











