శివాజీ రాజా దుర్మార్గుడు: వేణు మాధవ్ పొగడ్తలకు అంతా షాక్!

Recommended Video

Sivaji Raja Superb Speech At His Birthday Celebrations | Filmibeat Telugu

ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పుట్టినరోజు వేడుకలో ఆసక్తికరంగా ప్రసంగించి అందరినీ నవ్వించాడు. శివాజీ రాజా దుర్మార్గుడు.. మంచి వాడుకాదు.. ఆయనంత చెడ్డవాడు ఎవరూ లేరు.. అంటూ తన స్పీచ్ మొదలు పెట్టారు.

వేణు మాధవ్ మాటలు తిడుతున్నట్లు కనిపించినా... అవి విమర్శలు కాదు తిట్లరూపంలో ఉండే శృతి మించిన పొగడ్తలు, 'మా' అధ్యక్షుడిపై తనకు ఉన్న అభిమానం ప్రదర్శించడానికి చేసిన వ్యాఖ్యలు అని అర్థం కావడానికి అక్కడున్న వారికి ఎక్కువ సమయం పట్టలేదు.

ఎంత దుర్మార్గుడంటే..

ఎంత దుర్మార్గుడంటే..

శివాజీ రాజా తన దృష్టికి వచ్చిన ఏ విషయం అయినా.. అది ఇమ్మీడియేట్‌గా జరిగిపోవాలనేంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. ఆ పనికి ఎవరైతే కరెక్ట్ రా.. ఎవడైతే సరిగా చేస్తాడు రా.. మనం ఎలా చేద్దాం రా.. తర్జనభర్జన పడేంత మొండితనం. ఆ మొండితనంతో పైకొచ్చి అందరినీ కలుపుకుపోతాడు... అని వేణు మాధవ్ చెప్పుకొచ్చారు.

ఎప్పుడో చచ్చిపోవాల్సినోడు...

ఎప్పుడో చచ్చిపోవాల్సినోడు...

చిన్న ఆర్టిస్టుల నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు అందరినీ పట్టించుకునే నా అన్న శివాజీ... నిండు నూరేళ్లు బావుండాలి. అతడికి దేవుడు పునర్జన్మ ప్రసాదించాడు. ఆయన్ను ఎప్పుడైనా ఏమిటి విశేషాలు అన్నయ్యా అని కదిలిస్తే... నేను ఎప్పుడో పోవాల్సిన వాడిని, పోకుండా బ్రతికి ఉన్నాను కాబట్టి ఈ మిగిలిన జీవితాన్ని నా ఆర్టిస్టుల కోసం, మన వాళ్ల కోసం చేయాలి రా.. అంతే తప్ప నాకు ఏ కోరికలు లేవు అని అంటుంటారని వేణు మాధవ్ వ్యాఖ్యానించారు.

వేణు మాధవ్ శృతి మంచిన పొగడ్తలకు అంతా షాక్

వేణు మాధవ్ శృతి మంచిన పొగడ్తలకు అంతా షాక్

ఓ సందర్భంలో వేణు మాధవ్ పొగడ్తలు శృతి మించిపోయాయి. ‘శివాజీ అన్న చేపల పులుసు ఉంది తిను అంటే.. వద్దరా.. ఆ చేపల పులుసుకు ఎంత అవుద్ది..సుమారు 500 అవుతుందా? అందులో 300 ఎవరైనా ఆర్టిస్టుకు ఇవ్వు వారికి ఈ పూట గడిచిపోతుద్ది అనేంత దుర్మార్గుడు.' అంటూ వేణు మాధవ్ వ్యాఖ్యానించారు.

శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావు గురించి కూడా..

శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావు గురించి కూడా..

మేము గతంలో కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో పంచదార చిలక అనే సినిమా చేస్తున్నాం. వైజాగ్ నుంచి జబల్‌పూర్ వరకు ట్రైన్ లో వెళ్లాం. అక్కడ మేము దిగిన తర్వాత శ్రీకాంత్ అన్న మమ్మల్ని ఎక్కించుకుని రిక్షాతొక్కిన మహానుభావుడు. నాకు అత్యంత ఆత్మీయుడు నా వెంకీ (పరుచూరి వెంకటేశ్వర రావు) వెంకీ ఐలవ్ యూ డార్లింగ్. పరుచూరి గోపాలకృష్ణ గారిని డాడీ అంటాను కానీ, వెంకటేశ్వరరావుగారిని తమ్ముడు అనే పిలుస్తాను... అంటూ వేణు మాధవ్ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X