రామాచారి...మహా గడుసు సుమీ!
వేణు-కమలిని ముఖర్జీ జంటగా నటించిన చిత్రం 'రామాచారి". 'ఈడో పెద్ద గూఢచారి" అనేది ఉపశీర్షిక. 'మలయాళ హిట్‌చిత్రం 'సిఐడి మూస"కి రీమేక్ ఇది. జి.ఈశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామాచారి మహా గడుసు వాడిలా కనిపించబోతున్నాడట. ఇక పోతే...ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలైంది. మణిశర్మ సమకూర్చిన ఆడియోను వేడుకకు హాజరైన నందమూరి బాలకృష్ణ తొలిసీడీని ఆవిష్కరించి తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. ఈ వేడుకలో వేణు, అలీ, శ్యాంప్రసాద్, ఈశ్వర్, కె.విజయభాస్కర్, రామ్‌ప్రసాద్, రామజోగయ్య శాస్ర్తి, భీమినేని శ్రీనివాసరావు, విశ్వ, 'మధుర" ప్రతినిధి అప్పాజీ, కిషోర్‌దాస్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
హీరో వేణు మాట్లాడుతూ మన నేటివిటీకి తగ్గట్టు సినిమా ఉంటుందని, మణిశర్మ 5 పాటలకి అద్భుత సంగీతం ఇచ్చారు అని తెలిపారు. నవంబర్ చివరిలో సినిమా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలీ, గిరిబాబు, బాలయ్య, ఎల్బీ శ్రీరాం, చంద్రమోహన్, రఘుబాబు, సుత్తివేలు, అమిత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గతంలో స్వయంవరం, చిరునవ్వుతో చిత్రాలను నిర్మించిన ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.వి.శ్యాంప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











