twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేణు 'రామాచారి' విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    తొట్టెంపూడి వేణు, కమలిని ముఖర్జీ జంటగా జి. ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.వి.శ్యాంప్రసాద్ నిర్మిస్తున్న 'రామాచారి' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. 'ఈడో పెద్ద గూఢచారి' అన్నది ఉపశీర్షిక. ఈ నెల 21న ఆడియోను, చిత్రాన్ని నవంబర్ 17న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ...' ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆద్యంతం నవ్వుకునే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 21న ఆడియోను, నవంబర్ 17న చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు. దర్శకుడు ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ 'నేను దర్శకత్వశాఖలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో మలయాళంలో వచ్చిన 'సి.ఐ.డి మూస' చిత్రాన్ని ఇప్పుడు నా దర్శకత్వంలో 'రామాచారి'గా రూపొందించడం చాలా సంతోషంగా ఉంది. పూర్తి స్థాయి వినోదభరిత చిత్రమిది' అన్నారు. బ్రహ్మానందం, ఆలీ, ఎల్.బి.శ్రీరామ్, గిరిబాబు, చంద్రమోహన్, రఘుబాబు, వేలు, బాలయ్య, మురళీశర్మ, రాజ్‌ప్రేమి, ప్రభు, అమిత్, హర్షవర్ధన్, ఇందుఆనంద్, లిరిష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వి.విక్రమ్‌రాజు, డొంగ్రత్, నాగరాజు, రైటర్ మోహన్, కథ: ఉదయ్‌కృష్ణ, సిబికె థామస్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: కె.ప్రసాద్, కో ప్రొడ్యూసర్స్: బి.మురళి, పి.వి.నాగేశ్వరరావు, నిర్మాత: పి.వి.శ్యాంప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఈశ్వర్‌రెడ్డి.

    English summary
    Venu is coming out with his next movie titled Ramachari. The movie has a tag line of Veedo Pedda Gudachari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X