అల్లు అర్జున్ సినిమా ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన పవన్ డైరెక్టర్
అల్లు అర్జున్ పుష్ప అనంతరం మరింత స్పీడ్ పెంచాలని గట్టిగానే డిసైడ్ అయినట్లున్నాడు. ప్రస్తుతం బన్నీ లైనప్ చూస్తేనే ఆ విషయం ఈజీగా అర్ధమవుతోంది. అయితే ఒక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు చాలా రోజులుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అల.. వైకుంఠపురములో సినిమాతో హిట్ కొట్టగానే గత ఏడాది మరో సినిమాతో రావాలని అనుకున్నాడు.
కరోనా కారణంగా ప్లాన్స్ ప్లాప్ అయినప్పటికీ బన్నీ ఏ మాత్రం తగ్గకుండా స్పీడ్ పెంచుతున్నాడు. పుష్ప అనంతరం కొరటాల శివ సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత లిస్ట్ పెద్దగానే ఉంది. కానీ ముందు ఎవరితో వర్క్ చేస్తాడనేది తెలియలేదు. రీసెంట్ గా KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

ఇక సుకుమార్ కంటే ముందు నుంచి వేణు శ్రీరామ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఐకాన్ అని టైటిల్ కూడా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు బన్నీ వదిలేసుకున్నట్లు రూమర్స్ చాలానే వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని దర్శకుడు వేణు శ్రీరామ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. తప్పకుండా ఆ సినిమా ఉంటుందని చెప్పాడు. అయితే ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











