twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితంలో అదే పెద్ద షాక్.. ఆ సినిమాతో ఆఫర్స్ లేకుండా పోయాయి.. వకీల్ సాబ్ డైరెక్టర్ కామెంట్స్

    |

    ఓ మై ఫ్రెండ్ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో.. అది తన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో డైరెక్టర్ వేణు శ్రీ రామ్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమాతోనే జీవితమంటే ఏంటో నేర్చుకున్నానని తెలిపాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే ఈ చిత్ర విశేషాలు, తన జీవితంలోని ఒడిదుడుకుల గురించి వేణు శ్రీ రామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అవేంటో ఓసారి చూద్దాం.

    అవే నన్ను తీసుకొచ్చాయి..

    అవే నన్ను తీసుకొచ్చాయి..


    వేణు శ్రీ రామ్ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. ‘మాది జగిత్యాలలోని మేడిపల్లి. పుట్టింది పెరిగింది అంతా అక్కడే. మా నాన్న ఓ టైలర్. నాకు ఓ తమ్ముడు, చెల్లి ఉన్నారు. స్కూల్‌లో నేనే టాపర్‌ను. మా నాన్న నమ్మిన సిద్దాంతాలే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి.. పవర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే వరకు నడిపించాయి.

    అతి పెద్ద షాక్..

    అతి పెద్ద షాక్..

    అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించాను. ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, కొత్తబంగారు లోకం, మున్నా వంటి చిత్రాలకు పని చేశాను. ఆ తరువాత దిల్ రాజు నాకు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అప్పుడు ఓ మై ఫ్రెండ్ చిత్రం చేశాను. అదే సమయంలో మా తమ్ముడికి పెళ్లి చేస్తున్నారు.. మా నాన్న ఇళ్లు కడుతున్నాడు. అంతా బాగుందని అనుకున్న సమయంలో ఓ ప్రమాదంలో మా నాన్న చనిపోయాడు. ఆ సమయంలో ఓ మై ఫ్రెండ్ కూడా రిలీజ్ అయింది. మా నాన్న చనిపోవడమే నా జీవితంలో మొదటిది, అతి పెద్ద షాక్.

    జీవితమంటే ఏంటో..

    జీవితమంటే ఏంటో..

    ఓ మై ఫ్రెండ్ ఫలితంతో నాకు సినిమా ఆఫర్స్ లేకుండా పోయాయి. ఈ సినిమాతో జీవితమంటే ఏంటో తెలిసి వచ్చింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కోసం ఓ స్క్రిప్ట్ రాశాను. కానీ ఆయన్ను కలవలేకపోయాను. కొందరు పెద్ద స్టార్స్, యంగ్ హీరోలను కలిశాను గానీ ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు. ఓ మై ఫ్రెండ్ వచ్చిన ఐదేళ్ల తరువాత బెంగళూర్ డేస్ రీమేక్ ఛాన్స్ వచ్చింది కానీ అది కూడా వర్కౌట్ కాలేదు.

    అన్నీ క్యాన్సిల్..

    అన్నీ క్యాన్సిల్..


    రవితేజ కోసం రాసిన స్క్రిప్ట్ కూడా అటకెక్కింది. ఆపై నాని ఎంసీఏ చిత్రంతో హిట్ వచ్చింది. నాని కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించింది ఆ చిత్రం. దాని తరువాత ఐకాన్ స్క్రిప్ట్ రాసేందుకు సమయాన్ని కేటాయించాను. అల్లు అర్జున్‌ కూడా ఓకే చెప్పాడు. కానీ కొన్ని కారణాల తరువాత అది ఆలస్యం అయింది. ఆపై వకీల్ సాబ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింద'ని చెప్పుకొచ్చాడు.

    English summary
    Venu sriram About Career Struggles From Oh My Friend Movie. My struggles continued and the failure of Oh My Friend taught me many beautiful lessons about life and cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X