షర్ట్ కూడా అక్కడే మార్చుకునేవారు.. గ్యాప్ దొరికితే ఆయనకు అదే పని.. వకీల్ సాబ్ డైరెక్టర్ కామెంట్స్
ఒకప్పుడు వేణు శ్రీ రామ్ అనే పేరు అంతగా పరిచయం ఉండేది కాదు. ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ చిత్రాలను చేసినా అంతగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న పింక్ రీమేక్‌కు దర్శకుడిగా ఆయన పేరు వచ్చిందో అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్నాడు. పవర్ స్టార్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తాజగా ఓ వెబ్‌సైట్‌లో మాట్లాడిన ఈ డైరెక్టర్ అనేక విషయాలను పంచుకున్నాడు. అవేంటో ఓ సారి చూద్దాం.
Recommended Video

వకీల్ సాబ్ డైరెక్టర్‌గా ఫేమస్..
వేణు శ్రీ రామ్ దిల్ రాజు కాంపౌండ్‌లో పెరిగిన దర్శకుడు. ఆ కాంపౌండ్‌లోని డైరెక్టర్స్ ఫెయిలైనా సరే దిల్ రాజు అవకాశం ఇస్తూనే ఉంటాడు. అందుకే ఓ మై ఫ్రెండ్ ఫ్లాప్ అయినా.. ఎంసీఏ చిత్రానికి అవకాశం ఇచ్చాడు. ఆ కాన్ఫిడెన్స్‌తోనే వకీల్ సాబ్ బాధ్యతను అప్పగించాడు దిల్ రాజు.

దాదాపు పూర్తి..
వకీల్ సాబ్ విశేషాలను చెప్పిన వేణు శ్రీ రామ్.. ఈ సినిమా రెండున్నర గంటల నిడివి ఉంటుందని తెలిపాడు. అందులో రెండు గంటలకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నాడు. ఇక హీరోయిన్ పార్ట్ మాత్రమే మిగిలి ఉందని చెప్పుకొచ్చాడు.

శ్రుతీ హాసన్ డేట్స్..
కరోనా రావడం, లాక్ డౌన్ విధించడంతో అంతా తారుమారైందని తెలిపాడు. ఒకసారి పరిస్థితులు చక్కబడ్డాక శ్రుతీ హాసన్ డేట్స్ మళ్లీ అడ్జస్ట్ చేసుకుని మిగిలిన సీన్స్‌ను తెరకెక్కిస్తామని పేర్కొన్నాడు. ఈ విషయంలో దిల్ రాజు చొరవ తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.,

రెండు విధాలుగా ఉండరు..
పవన్ కళ్యాణ్‌తో పని చేసిన అనుభవం గురించి చెబుతూ... పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణే.. ఆయనకు రెండు విధాలుగా ప్రవర్తించడం రాదని చెప్పుకొచ్చాడు. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే చాలు పుస్తకాలు చదువుతూ ఉంటారని కానీ మేము ఆయనకు ఆ సమయాన్ని ఇవ్వలేదని తెలిపాడు.

షర్ట్ కూడా అక్కడే..
వకీల్ సాబ్‌ను ఎంత త్వరగా పూర్తి చేశామంటే.. పవన్ కళ్యాణ్ అసలు క్యారవ్యాన్‌లోకి వెళ్లేవారు కాదు చకచకా సీన్స్ తీసేవారమని తెలిపాడు. క్యారవ్యాన్‌లోకి వెళ్తే టైమ్ వేస్ట్ అవుతుందని, షర్ట్ కూడా అక్కడే పక్కకు వెళ్లి మార్చుకునే వారని తెలిపాడు.


Click it and Unblock the Notifications











