twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్క్రిప్ట్ త్రివిక్రమ్ రాయాల్సింది కానీ.. అదే ఆయనలోని గొప్ప లక్షణం.. వకీల్ సాబ్ డైరెక్టర్ కామెంట్స్

    |

    ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ వంటి చిత్రాలను తెరకెక్కించాడు వేణు శ్రీ రామ్. అయితే ఈ రెండు చిత్రాలతో ఎంత పేరు వచ్చిందో తెలియదు కానీ వకీల్ సాబ్ డైరెక్టర్‌గానే అందరూ గుర్తిస్తున్నారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు గానీ వేణు శ్రీ రామ్ పేరు కాస్త వకీల్ సాబ్ డైరెక్టర్‌ అని ఫిక్స్ అయ్యారు. అంతలా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమాపై అంచనాలున్నాయి. అలాంటి చిత్రాన్ని తన భుజాలపై మోస్తున్నాడు వేణు. ఆయన తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించాడు.

    త్రివిక్రమ్ చొరవతోనే...

    త్రివిక్రమ్ చొరవతోనే...


    వకీల్ సాబ్ చిత్రం త్రివిక్రమ్ చొరవతోనే మొదలైందని అందరికీ తెలిసిందే. పింక్ చిత్రాన్ని వీక్షించిన త్రివిక్రమ్ అటు పవన్‌కు ఇటు దిల్ రాజుకు మధ్య వారదిగా నిలిచాడు. ఈ విషయంపై వేణు మాట్లాడుతూ.. ఓసారి దిల్ రాజుతో కలిసి త్రివిక్రమ్ దగ్గరికి వెళ్లానని వారిద్దరూ పింక్ రీమేక్ గురించి మాట్లాడుకున్నారని తెలిపాడు. అయితే ఆ సమయంలో ఆ అవకాశం తనకు వస్తుందని అనుకోలేదన్నాడు.

     త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాయాలి..

    త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాయాలి..

    మామూలుగా అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాయాల్సింది కానీ.. ఆయన అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉండటంతో రాయలేకపోయారు. ఆ సినిమా విడుదలయ్యాకే మా చిత్రం మొదలైందని తెలిపాడు.

    అదే ఆయన గొప్పదనం..

    అదే ఆయన గొప్పదనం..


    చుట్టూ ఉన్న మనుషులందర్నీ ఒకేలా చూడటం, గౌరవించడం ఆయనలోని గొప్ప లక్షణమని తెలిపాడు. కంగారులోనైనా గారు అని సంబోధించడం మరిచిపోరని పేర్కొన్నాడు. పుస్తకాలు చదువుతారా? ఇంత వరకు ఏం చదివారు? అనే ప్రశ్నలే మొదటగా వేస్తారని అన్నాడు.

    ఆ సినిమా 23 సార్లు చూశా..

    ఆ సినిమా 23 సార్లు చూశా..

    తాను పవన్ ఫ్యాన్‌ అని తెలిపాడు. ఖుషి సినిమాను 22 సార్లు, గబ్బర్ సింగ్‌ను 23 సార్లు చూశానని పేర్కొన్నాడు. ఇష్టమైన స్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేమని అన్నాడు.

    English summary
    Venu Sriram About Trivikram In Vakeel Saab Script. He Says That Trivikram Is Used To Write Script For Vakeel Saab But He Is Busy With ALa Vaikunthapurramuloo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X