వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ చేయకపోయి ఉంటే.. మరో హీరోపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
వకీల్ సాబ్ సినిమాపై ప్రస్తుతం పెరుగుతున్న బజ్ అంతా ఇంతా కాదు. గతంలో ఎప్పుడు లేని విదంగా పవన్ కళ్యాణ్ సినిమా అడ్వాన్స్ బూకింగ్స్ తోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. పైగా పవర్ స్టార్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా కాబట్టి ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అందుకే సినిమాకు పోటీగా ఏ సినిమా రాలేకపోయింది. ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకా ఎవరు చేస్తే సెట్టయ్యేదనే విషయంపై దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

సర్వం వకీల్ సాబ్ మయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పై ప్రస్తుతం మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. సర్వం వకీల్ సాబ్ మయం అనేలా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నిన్నటి నుంచే థియేటర్స్ వద్ద భారీ స్థాయిలో కటౌట్స్ రెడీ చేశారు. ఫ్లెక్సీలు బ్యానర్ లతో థియేటర్స్ లో ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పారు.

పవన్ క్రేజ్ కు తగ్గట్లు..
చాలా గ్యాప్ తరువాత పవన్ చేస్తున్న సినిమా పింక్ రీమేక్ అనగానే మొదట కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దర్శకుడు వేణు శ్రీరామ్ మాత్రం అభిమానులను ఏ మాత్రం నిరాశపరచకుండా సినిమాను డిజైన్ చేసినట్లు క్లారిటీ ఇచ్చేశారు. అసలు కథను మార్చకుండా పవన్ క్రేజ్ కు తగ్గట్లు ప్రతి పది నిమిషాలకొక ఎలివేషన్ సీన్ ను డిజైన్ చేసినట్లు చెప్పారు.

పవన్ కళ్యాణ్ చేయకపోతే?
మొదట ఈ సినిమాను దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలనే ఆలోచనతోనే రీమేక్ రైట్స్ ను అందుకున్నాడు. అయితే వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ చేయకుండా ఉండి ఉంటే ఎవరిని సెలెక్ట్ చేసుకునేవారు అని ఇటీవల దర్శకుడిని అడుగగా అతను చాలా క్లియర్ వివరణ ఇచ్చాడు.

నాగార్జునతో వకీల్ సాబ్
నా ఆలోచన వరకైతే పవన్ కళ్యాణ్ బెస్ట్ ఆప్షన్ అంటూ ఒకవేళ ఆయన చేయకపోయి ఉంటే నాగార్జున గారు మాత్రమే సెట్టయ్యేవారు అని దర్శకుడు వేణు శ్రీరామ్ వివరణ ఇచ్చారు. ఎందుకంటే నాగార్జునతో ఎలాంటి ప్రయోగాలు అయినా చేయయావచ్చని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కంగారు పడాల్సిన అవసరం ఉండదని అంటూ కథలో అసలు పాయింట్ ను ఉన్నది ఉన్నట్లుగా చెప్పవచ్చని వేణు వివరణ ఇచ్చారు. అంతే


Click it and Unblock the Notifications











