కంటతడి పెట్టిన దర్శకుడు శ్రీరాం వేణు.. ఓదార్చిన దిల్ రాజు.. వకీల్ సాబ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఎమోషనల్‌గా

వకీల్ సాబ్ భారీగా సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరాం వేణు, చిత్ర యూనిట్ సభ్యులు సంబరాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాం వేణు సినిమా విశేషాలను పంచుకొన్నారు. ఈ సందర్బంగా తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. దాదాపు కంటతడి పెట్టుకొన్నంత పనిచేయగా దిల్ రాజు ఓదార్చారు. శ్రీరాం వేణు ఈ సందర్భంగా మాట్లాడుతూ..

బికినీలో బోల్డ్ భామ... స్విమ్మింగ్‌పూల్‌లో హాట్ హాట్‌గా అందాల ఆరబోత

సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ మధ్యలో చిక్కుకొని

సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ మధ్యలో చిక్కుకొని

కూకట్‌పల్లిలో వకీల్ సాబ్ మూవీని ఫ్యాన్స్ షోలో అభిమానుల మధ్య కూర్చొని చూశాను. సినిమా ముగిసిన తర్వాత దిల్ రాజుకు తన డైరెక్టర్లతో మాట్లాడటం అలవాటు. షో ముగియగానే రాజు గారు కాల్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగారు. అయితే ఫ్యాన్స్ మధ్య చిక్కుపోయానని చెప్పాను. అక్కడి నుంచి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశాను. సినిమా చూసిన తర్వాత డైరెక్ట్‌గా పవన్ కల్యాణ్‌తో అనుభూతులు పంచుకోవడం హ్యాపీగా ఉంది. పవన్ కల్యాణ్ ప్రతీ చిన్న విషయాన్ని అడిగి తెలుసుకొన్నారు అని శ్రీరాం వేణు పేర్కొన్నారు.

 పవన్ కల్యాణ్ చేత తెలంగాణ భాష

పవన్ కల్యాణ్ చేత తెలంగాణ భాష

వకీల్ సాబ్‌లో పవన్ కల్యాణ్‌కు తెలంగాణ యాసను పెట్టడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. అయితే మేమంత తెలంగాణ నుంచి వచ్చాం కాబట్టి ఆ భాషను పవన్ కల్యాణ్ చేత చెప్పించాలని అనుకొన్నాం. వకీల్ సాబ్ సినిమా విజయానికి టీమ్ సమిష్టి కృష్టి కారణం. అందుకు దిల్ రాజుకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. కెరీర్ పరంగా నేను ఇక్కడే పుట్టి 18 సంవత్సరాలుగా ఇక్కడే పెరుగుతున్నాను అని శ్రీరాం వేణు తెలిపారు.

నా మొదటి సినిమా తర్వాత మా నాన్నను కోల్పోయా

నా మొదటి సినిమా తర్వాత మా నాన్నను కోల్పోయా

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మా నాన్న టైలర్ అని చెప్పడానికి కారణం.. నాకు జన్మనిచ్చిన ఆయనను తలుచుకోవడమే. నా మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ సినిమా తర్వాత మరుసటి రోజే మా నాన్న చనిపోయారు. ఆయన ఇప్పుడు ఉంటే చాలా సంతోషపడేవారు. ఆయన లేకపోవడం బాధగా ఉంది అని శ్రీరాం వేణు కంటతడి చెప్పారు.

ప్రజల నుంచి పుట్టిన క్యారెక్టర్

ప్రజల నుంచి పుట్టిన క్యారెక్టర్

వకీల్ సాబ్‌లో పవన్ కల్యాణ్‌ను కాకుండా జనసేన నేతగా ఆయనను దృష్టిలో పెట్టుకొని మాటలు రాసిన మాట నిజమే. కానీ ప్రజల మధ్య నుంచి సత్యదేవ్ క్యారెక్టర్ పుట్టింది. ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి అలా అనిపిస్తాయి. ఒకవేళ రెండు రకాలు కనెక్ట్ అయితే నేను హ్యాపీ. కొన్నిసార్లు ఇలాంటి డైలాగ్స్ అవసరమా అని పవన్ కల్యాణ్ అడిగితే.. ఈ పాత్ర ప్రజల కోసం పోరాడే వ్యక్తి.. ఆ డైలాగ్ అవసరం అని చెప్పాను అని శ్రీరాం వేణు పేర్కొన్నారు.

Recommended Video

Vakeel Saab Review : Pawan Kalyan పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్... సమస్యలను వేలెత్తి చూపించే కంటెంట్!!
 శ్రీరాం వేణును సత్కరించిన దిల్ రాజు

శ్రీరాం వేణును సత్కరించిన దిల్ రాజు

వకీల్ సాబ్ లక్షలాది మంది ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ప్రకాశ్ రాజ్, అంజలి, నివేదా థామస్ అందరూ అద్బుతంగా నటించారు. సాంకేతిక విభాగం కూర్పు చక్కగా కుదిరింది అంటూ శ్రీరాం వేణు పేర్కొన్నారు. మీడియాతో సంభాషించిన తర్వాత శ్రీరాం వేణును శాలువాతో సత్కరించి బొకేను దిల్ రాజు అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X