నాగ చైతన్య, శోభితపై వేణు స్వామి కామెంట్స్ వైరల్.. పెళ్లి తర్వాత వీళ్ల లైఫ్ గురించి అలా!
సినీ రంగానికి చెందిన సెలెబ్రిటీలు ఏం చేసినా హాట్ టాపిక్ అవుతుంటుంది. అలాంటిది ప్రేమలు, ఎంగేజ్‌మెంట్, పెళ్లి అలాంటి వాటికి సంబంధించిన ప్రకటనలు చేస్తే సంచలనంగా మారిపోతుంది. ఇప్పుడు అదే పరిస్థితి దేశ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఎందుకంటే టాలీవుడ్‌కు చెందిన యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, పాన్ ఇండియా బ్యూటీ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడమే. దీంతో ఇప్పుడీ అంశం దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళ్తే...
సమంత తర్వాత ఆమెతో
అక్కినేని నాగ చైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు ఇచ్చేశాడు. అప్పటి నుంచి అతడు సింగిల్‌గా ఉంటున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, చైతూ మాత్రం తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు. దీనిపై అప్పుడప్పుడూ లీకులు కూడా వచ్చాయి. దీంతో వీళ్ల వ్యవహారం చాలా రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది.

ఎంగేజ్‌మెంట్ అంటూనే
శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, వాటిని అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా నమ్మలేదు. అయితే, వీళ్లిద్దరూ ఫారెన్‌లో కలిసి దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని టాక్ మొదలైంది. అప్పటి నుంచి వీళ్ల ఎంగేజ్‌మెంట్ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అధికారిక ప్రకటన ఇస్తూ
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడని రెండు మూడు రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. వీటిని నిజం చేస్తూ ఈరోజే (ఆగస్టు 8) వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఈ జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు.

శుభాకాంక్షలు వెల్లువలా
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నేపథ్యంలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో మంది సినిమా వాళ్లు విషెస్ చెబుతున్నారు. అలాగే, అక్కినేని అభిమానులు సైతం తమ ఫేవరెట్ హీరోకు శుభాకాంక్షలు చెప్తున్నారు. దీంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.
వేణు స్వామి పోస్ట్ వైరల్
సినిమా పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా.. పెళ్లి చేసుకున్నా వెంటనే ఒక వ్యక్తి మీడియా ముందు వాలిపోతుంటారు. ఆయనే ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి. ఇప్పటికే చాలా మంది విషయంలో కరెక్టుగా అంచనాలు వేసిన ఆయన.. ఇప్పుడు శోభిత, నాగ చైతన్య వివాహ బంధం గురించి కూడా స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని పెట్టారు.

రేపు ఏం చెబుతాడో అని
వేణు స్వామి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన, జాతకపరమైన విశ్లేషణ రేపు చేస్తాను' అని పోస్ట్ చేశారు. గతంలో సమంత, నాగ చైతన్య విడిపోతారని కూడా ఆయన అంచనా వేసిన నేపథ్యంలో.. ఇప్పుడు కొత్త జంట గురించి ఆయన ఏం చెబుతారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.


Click it and Unblock the Notifications











