SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయనకు ఇటీవల కాలంలో స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. ఓ స్టార్ హీరో రేంజులో ఆయనకు క్రేజ్ వచ్చేసింది. దానికి కారణం అందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ.. అన్నీ కంట్రావర్సీ మాటలను మాట్లాడటం.

ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై మరో బాంబు పేల్చాడు. దీంతో నెటిజన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది సరికాదంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

Venu Swamy Sensational Comments on Rajamouli Mahesh Babu Movie News Goes Viral

ఇంతకీ వేణు స్వామి ఎవరంటే..
అసలు ఈ వేణుస్వామి ఎవరు... ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు.. సినిమా ఇండస్ట్రీకి ఆయనకు సంబంధం ఏంటి.. అనేది చాలా మందికి తెలియదు. ఈ వేణుస్వామి అప్పట్లో సినిమా ఫంక్షన్లకు, సినిమా ఈవెంట్లకు, సినిమా ప్రారంభోత్సవాలకు ముహూర్తాలు పెట్టేవాడు. అలా సినిమా ఇండస్ట్రీలో భాగం అయ్యాడు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలపై మక్కువపై పలు సినిమాల్లోనూ నటించాడు. జగపతి బాబు నటించిన జగపతి అనే చిత్రంలో పూజారి పాత్రను చేశాడు వేణుస్వామి.

అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు..
ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు అతడు చిత్రంలో త్రిష అక్క పెళ్లిని చేసే పూజారి పాత్రలోనూ వేణు స్వామి నటించాడు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే ఆయన.. ఇప్పుడు స్టార్ హీరో లెవెల్ క్రేజ్ ఎందుకు వచ్చిదంటే.. సమంత, నాగచైతన్య. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఓసారి సమంత, నాగచైతన్య పెళ్లి గురించి మాట్లాడుతూ వీరు విడిపోతారు అని అని చెప్పుకువచ్చాడు వేణుస్వామి. ఇక అప్పుడు ఎవరు ఆయన్ని పట్టించుకోలేదు.

అలా ఫేమస్...
కానీ నిజంగానే కొన్నాళ్లకు సమంత, నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన నేను చెప్పింది నిజం అయిందంటూ మళ్లీ ఆ వీడియోలను బయటకు తీసి ప్రమోట్ చేసుకున్నాడు. దీంతో అప్పుడు ఆయన్నీ నమ్మడం స్టార్ట్ చేశారు జనాలు. ఇక ప్రభాస్ విషయంలో, అల్లు అర్జున్ విషయంలో చెప్పినవి కాస్త నిజం కావడంతో స్టార్ డమ్ వచ్చేసింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు ఆయన వద్ద పూజలు చేయించుకుంటూ ఉంటారు.

Venu Swamy Sensational Comments on Rajamouli Mahesh Babu Movie News Goes Viral

మహేష్ బాబుపై వేణు స్వామి..
రష్మిక మందన్నా, డింపుల్ హయతీ, బాలకృష్ణ, అనన్య నాగళ్ల.. ఇలా చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఆయన్ని నమ్మి పూజలు చేస్తుంటారు. ఆ విషయం పక్కన పెడితే.. మొన్నటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ చేతుల్లో ట్రోలింగ్ కు గురైన వేణు స్వామి ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మహేష్ బాబు సినిమాపై ఆయన మరోసారి బాంబుపేల్చాడు. జక్కన్న దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ ఫ్యాన్స్ ఫైర్...
అయితే ఈ సినిమాకు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయనే టాక్ నడుస్తుంది. అయితే మహేష్ బాబుకు ఆ రేంజ్ మార్కెట్ ఎక్కడిది.. వెయ్యి కోట్లు రావు అంటూ మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X