నాగ చైతన్య, శోభిత మధ్య గొడవలు ఖాయం.. ఆ లేడీ వల్ల విడిపోతారు: వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు ప్రేమ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం విడాకులు తీసుకున్నారు. అందులో యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఒకడు. సమంతతో విడిపోయిన తర్వాత సింగిల్‌గా ఉంటోన్న అతడు.. గత గురువారమే మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. దీంతో వీళ్ల జంట హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి.. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జాతకం బయటపెట్టాడు. ఆ వివరాలు మీరే చూడండి!

సీక్రెట్‌గా డేటింగ్ చేశాడు
యువసామ్రాట్ నాగ చైతన్య కొన్నేళ్ల క్రితమే స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నాడు. కానీ, కొద్ది వ్యవధిలోనే ఆమెకు విడాకులు కూడా ఇచ్చేశాడు. అది అయిన కొన్నాళ్లకే తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ మొదలెట్టాడు. కానీ, ఇది బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినప్పటికీ వీళ్లిద్దరి వ్యవహారం మాత్రం ముందుగానే లీక్ అయింది.

Venu Swamy Sensational Prediction on Naga Chaitanya and Sobhita Dhulipala Marriage Life

ఎంగేజ్‌మెంట్ అయింది

శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య లవ్ ట్రాక్ గురించి చాలా కాలంగా ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 8న వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకుని సర్‌ప్రైజ్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడంతో దీనిపై అధికారిక ప్రకటన వచ్చినట్లైంది.

ట్రెండింగ్.. వేణు స్వామి
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నేపథ్యంలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వీళ్లిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వేణు స్వామి 'నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన, జాతకపరమైన విశ్లేషణ రేపు చేస్తాను' అని పోస్ట్ చేశారు.

Venu Swamy Sensational Prediction on Naga Chaitanya and Sobhita Dhulipala Marriage Life

వేణు స్వామి ప్రెడిక్షన్

అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ అయిన వేణు స్వామి వీళ్లిద్దరి జాతకాలపై మాట్లాడతానని ముందుగానే చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆయన తాజాగా వీటిపై విశ్లేషణ జరిపారు. మొత్తం అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల కూడా ఎంతో కాలం కలిసి ఉండరని ఆయన తేల్చేశారు.

ఈ జంటకు విభేదాలు
ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి తాజాగా విడుదల చేసిన వీడియోలో 'అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జాతకాలు కూడా కలవలేదు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నా ఇబ్బందులు కచ్చితంగా వస్తాయి. వాళ్ల వాళ్ల జాతకాల ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత అంటే 2027 వరకు బాగానే ఉంటారు. కానీ ఆ తర్వాత వీళ్లిద్దరికీ మనస్పర్ధలు వస్తాయి' అంటూ బాంబ్ పేల్చారు.

Venu Swamy Sensational Prediction on Naga Chaitanya and Sobhita Dhulipala Marriage Life

ఆ లేడీ ఎంట్రీ వల్లే ఇలా

వేణు స్వామి కంటిన్యూ చేస్తూ.. 'నాగ చైతన్య - శోభితకు ఒక స్త్రీ వల్ల సమస్యలు, గొడవలు వస్తాయి. ఇవి వీళ్లిద్దరూ విడిపోడానికి దారి తీస్తాయి. నేను.. వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముహుర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూసిన తర్వాత చెబుతున్నాను. వారు ఏమాత్రం కలిసి ఉండలేరు. కానీ, నా అంచనా తప్పాలని కోరుకుంటున్నాను' అంటూ వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X