నయనతారకు సంతానం యోగం లేదు.. పెళ్లికి ముందే పిల్లల కోసం ఆ పని: బాంబ్ పేల్చిన వేణు స్వామి

దక్షిణ భారతదేశం మొత్తంలో హవాను చూపిస్తూ నెంబర్ వన్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. సుదీర్ఘ కాలంగా తనదైన అందం, అభినయంతో మెప్పిస్తోన్న ఆమె.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇలా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. అదే సమయంలో విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న తర్వాత పర్సనల్‌ లైఫ్‌నూ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఆమె సరోగసి ద్వారా పిల్లల్ని కనడంపై తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే....

దర్శకుడితో వైవాహిక జీవితం:నయనతార.. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం జరిగిన చాలా తక్కువ సమయంలోనే సినిమా పనుల్లో బిజీ అయిన ఈ సినీ జంట.. ఖాళీ సమయాల్లో తమ వైవాహిక జీవితాన్ని చక్కగా గడుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ విహార యాత్రకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం వంటి వాటితో ఫుల్‌గా చిల్ అవుతోంది.

Venu Swamy Shocking Comments on Nayanthara Surrogacy and Astrology

సరోగసి ద్వారా.. విమర్శలతో:విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న తర్వాత నయనతార సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు తల్లైంది. ఇది వీళ్ల వివాహం జరిగిన ఐదు నెలలకే జరిగింది. అప్పట్లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా నయనతార తన గ్లామర్ పాడవుతుందన్న కారణంతోనే సరోగసి ద్వారా తల్లైందన్న విమర్శలు వచ్చాయి. కానీ, వీటిపై ఆమె కానీ, విఘ్నేష్ కానీ స్పందించలేదు.

బాంబ్ పేల్చిన వేణు స్వామి:నయనతార సరోగసిపై చాలా కాలం పాటు పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కానీ, ఇప్పుడు ఇవన్నీ ఆగిపోయాయి. దీంతో అసలు ఈ అంశాన్ని అందరూ మర్చిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. నయనతార సరోగసి విధానం గురించి తాజాగా ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన ఆమె జాతకంలోని ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు.

Venu Swamy Shocking Comments on Nayanthara Surrogacy and Astrology

అసలు ఆ యోగమే లేదని:తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి.. నయనతార జాతకం గురించి మాట్లాడారు. 'నయనతార జాతకం నాకు తెలుసు. ముఖ్యంగా ఆమె సంతానం, సరోగసి విధానం గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. కానీ, అవన్నీ తప్పు. నయనతారకు సంతాన యోగ్యం లేదు. అందుకే ఆమె సరోగసి పద్దతి ద్వారా తల్లి అవ్వాలని నిర్ణయం తీసుకుంది' అని చెప్పుకొచ్చారు.

అదంతా పెద్ద డ్రామా అని:ఇదే ఇంటర్వ్యూలో వేణు స్వామి కంటిన్యూ చేస్తూ.. 'బయట ప్రచారం జరుగుతున్నట్లుగా పిల్లల్ని కంటే ఫిజిక్ పాడవుతుందని నయనతార సరోగసి ద్వారా తల్లి కాలేదు. అదంతా పెద్ద డ్రామా మాత్రమే. ఆమె జాతకంలో అసలు సంతానమే లేదు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే బయట ఈ రకమైన ప్రచారం తెరపైకి తీసుకు వచ్చారు' అంటూ మరో బాంబ్ పేల్చారు.

Venu Swamy Shocking Comments on Nayanthara Surrogacy and Astrology

కాజల్ అగర్వాల్ గురించి:వేణు స్వామి కొనసాగిస్తూ.. 'నయనతార ఫిజిక్, స్ట్రక్చర్ కోసమే సరోగసి ద్వారా పిల్లల్ని కని ఉంటే.. కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనింది కదా. మళ్లీ ఫిజిక్ పర్‌ఫెక్టుగా తెచ్చుకుని సినిమాలు చేస్తుంది కదా. నయనతార కూడా అలానే చేయొచ్చు కదా. కానీ, నయనతార మాత్రం జాతక దోషం వల్లే చేసింది. ఇందుకోసం భర్తను పెళ్లికి ముందే ఒప్పించింది' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X