పవన్ జాతకంలో లోపం.. ఈసారి గెలుపు ఆ పార్టీదే: ఎన్నికలకు ముందు బాంబ్ పేల్చిన వేణు స్వామి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. అక్కడ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు అన్నీ సన్నద్దం అవుతున్నాయి. ఏపీలో ఎంతో మంది బడా నేతలు ఉన్నా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా హైలైట్ అవుతున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసిన అతడు.. ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ జాతకంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలను మీరే చూసేయండి!
ఎన్నికలకు సర్వం సిద్ధం:ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సమయం ఆసన్నం అవడంతో ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రచార వేగం పెంచేశాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేయాలని జనాలను ఆకర్షించే మ్యానిఫెస్టోలతో వస్తున్నాయి. ఇలా పార్టలన్నీ ప్రచారంతో బిజీగా ఉంటే.. అధికారులు ఎన్నికలకు సర్వం సిద్ధం చేసేస్తున్నారు.

జనసేనాని ప్రచారం వేడి:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలన్న లక్ష్యంతో పవన్ కల్యాణ్.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు పార్టీలు కలిసి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఎండ వేడిమిలో సైతం రోజుకు రెండు మూడు చోట్ల సభలు, రోడ్ షోలు ఏర్పాటు చేస్తూ దూసుకుపోతోన్నాడు.
పిఠాపురంలో ధీమాగానే:మరికొద్ది రోజుల్లోనే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్నాడు. అక్కడ ఇప్పటికే పలుమార్లు ప్రచారం నిర్వహించిన ఆయన.. ఇప్పుడు వేరే ప్రాంతాల్లో మీటింగ్‌లకు వెళ్తున్నాడు. అందుకే సినీ, టీవీ పరిశ్రమలకు చెందిన నటీనటులు పిఠాపురంలో పవన్ తరపున ప్రచారం చేస్తున్నారు. దీంతో అక్కడి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

వేణు స్వామి కామెంట్స్:ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'పవన్ కల్యాణ్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేదు. అతడి జాతకంలో అలాంటి యోగం లేదు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ పవన్ కల్యాణ్ సీఎం కాడు' అని చెప్పుకొచ్చారు.

మోసపోవడం ఖాయం:ఇదే ఇంటర్వ్యూలో వేణు స్వామి 'పవన్ కల్యాణ్.. చంద్రబాబు చేతిలో మోసపోవడం ఖాయం. గ్రహాల రిత్యా వీళ్లిద్దరివీ ప్రతికూల ప్రభావం ఉన్న నక్షత్రాలు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం. పవన్ కల్యాణ్‌ది ఉత్తరాషాడ నక్షత్రం. ఈ రెండింటికి అస్సలు పొత్తు కలవదు. అందుకే వీళ్లిద్దరి జాతక ప్రభావం వల్ల పొత్తు కూడా పెద్దగా ప్రభావాన్ని చూపే అవకాశం లేదు' అని తెలిపారు.

ఎవరు గెలుస్తారంటే:వేణు స్వామి కంటిన్యూ చేస్తూ.. 'చంద్రబాబు, పవన్ కల్యాణ్ నక్షత్రాల ప్రభావం వాళ్ల కూటమిపై కూడా పడుతుంది. అందుకే వీళ్లకు ఓటు బదిలీ జరగదు. దీంతో ఈ ఎన్నికల్లో ఈ కూటమి ఓడిపోవడం ఖాయం. కాబట్టి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుంది. నాకు పవన్‌తో ఎలాంటి గొడవలు లేవు. జాతకం ప్రకారమే చెప్తున్నాను' అని అన్నారు.


Click it and Unblock the Notifications











