ప్రభాస్‌కు, శ్యామల దేవికి సంబంధమే లేదు.. అసలు నిజాలు బయటపెట్టిన వేణు స్వామి
తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోలు ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న అతడు.. 'సలార్: సీజ్‌ఫైర్'తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. దీంతో మరింత ఉత్సాహంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి ప్రభాస్‌పై కామెంట్స్ చేశారు. అంతేకాదు, కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి గురించి కూడా మాట్లాడారు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!
సలార్‌తో మరోసారి ట్రాక్‌లోకి:'బాహుబలి' సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' వంటి చిత్రాలు చేశాడు. కానీ, ఇవేమీ అతడికి హిట్‌ను అందించలేదు. ఈ పరిస్థితుల్లోనే 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో వచ్చాడు. ఈ సినిమాకు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించి అతడిని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించింది.

ఇప్పుడా మూవీలతో బిజీగా:చాలా కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ప్రభాస్.. ఇప్పుడు కూడా ఎన్నో మూవీలను లైన్‌లో పెట్టుకున్నాడు. అలా ప్రస్తుతం ఈ రెబెల్ స్టార్ 'కల్కి 2898 ఏడీ', 'సలార్ పార్ట్ 2', 'ది రాజా సాబ్', 'స్పిరిట్' సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.
మళ్లీ వేణు స్వామి టాపిక్‌తో:పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతోన్న ప్రభాస్ జాతకం ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి కారణం ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి అతడి జాతకంలో లోపాలు ఉన్నాయని, ఈ కారణంగా సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు వస్తాయని చెప్తుండడమే. ఇప్పుడు మరోసారి ఆయన ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

శ్యామల దేవిపై షాకింగ్‌గా:జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి ప్రభాస్‌పై, అతడి పెద్దమ్మ శ్యామల దేవిపై మాట్లాడారు. 'ప్రభాస్‌కు, ఆయన పెద్దమ్మ శ్యామల దేవికి అసలు సంబంధమే లేదు. వాళ్లిద్దరూ బంధువులే అని చాలా మంది అనుకుంటారు. కానీ, అసలు నిజాలు ఏంటి అనేది నాకు మాత్రం తెలుసు' అని చెప్పారు.
ప్రభాస్ జాతకం వచ్చింది:వేణు స్వామి కంటిన్యూ చేస్తూ.. 'నేను శ్యామల దేవి కంటే ప్రభాస్ తల్లి గారికే ప్రాధాన్యత ఇస్తాను. కానీ, ఇప్పుడు వాళ్ల వ్యక్తిగత విషయాలు చెప్పను. ఒక సందర్భంలో వేరే వాళ్ల ద్వారా ప్రభాస్ జాతకం నా దగ్గరకు వచ్చింది. అది ఎవరి ద్వారా వచ్చిందో మాత్రం ఇప్పుడు చెప్పను. కానీ, అది అప్పుడు చూశాను. అప్పుడే అతడి గురించి అవగాహన చేసుకున్నాను' అని తెలిపారు.

కృష్ణంరాజు కోసం వచ్చారు:వేణు స్వామి కొనసాగిస్తూ.. 'ఒకసారి శ్యామల దేవి గారు కూడా నా దగ్గరకు వచ్చారు. కానీ, ఆమె ప్రభాస్ గురించి అడగలేదు. కృష్ణంరాజు గారు బతికి ఉన్నప్పుడు ఆయన గవర్నర్ అయ్యే అవకాశం ఉందా అని అడిగారు. అలాంటి ఆమె నేను ఎవరో తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











