ప్రభాస్‌కు అందుకే పెళ్లి కాలేదు.. సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా: మరోసారి వేణు స్వామి కామెంట్స్
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కొందరు హీరోలు కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌కు ఎదిగిపోయారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. వరుస పెట్టి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోన్న అతడు.. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు. అయితే, కొన్ని ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ జాతకం బాలేదని ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి కామెంట్స్ చేసి షాకిచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన మరోసారి దీనిపై స్పందించారు. ఆ వివరాలు మీకోసమే!
సలార్‌తో ప్రభాస్ హిట్ ట్రాక్:'బాహుబలి' సిరీస్ తర్వాత ప్రభాస్ 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' వంటి చిత్రాలు చేశాడు. కానీ, ఇవేమీ అతడికి విజయాన్ని అందించలేదు. ఈ పరిస్థితుల్లోనే గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించి అతడిని హిట్ ట్రాక్ ఎక్కించింది.

ఆ మూవీలు చేస్తూ బిజీగానే:కొంత కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ప్రభాస్.. ఇప్పుడు కూడా చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం అతడు 'కల్కి 2898 ఏడీ', 'సలార్ పార్ట్ 2', 'ది రాజా సాబ్', 'స్పిరిట్' సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
వేణు స్వామి ప్రస్తావనలతో:దేశ వ్యాప్తంగా క్రేజ్‌తో దూసుకెళ్తోన్న ప్రభాస్ జాతకం ఆ మధ్య హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి కారణం ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి అతడి జాతకంలో లోపాలు ఉన్నాయని, సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు వస్తాయని చెప్తుండడమే. ఇప్పుడు మరోసారి ఆయన ప్రభాస్ పెళ్లి, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

వాళ్ల జాతకాలు తెలుసంటూ:ఇప్పటికే ప్రభాస్ గురించి పలు సందర్భాల్లో మాట్లాడిన వేణు స్వామి.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన 'నేను పదమూడేళ్ల వయసులో ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారు నాకు చాలా పరిచయం. వాళ్ల ఫ్యామిలీలోని అందరి జాతకాలు నాకు బాగా తెలుసు' అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు.
ప్రభాస్ ఎలా వచ్చాడంటే:ఇప్పటికే ప్రభాస్ ఆరోగ్యం, సినిమాల విఫలం గురించి పలుమార్లు స్పందించిన వేణు స్వామి.. తాజా ఇంటర్వ్యూలో అతడి ఎంట్రీ గురించి కూడా మాట్లాడారు. 'ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ ఎలా చేశాడో కూడా నాకు తెలుసు. ఊరికే సోషల్ మీడియాలో ఆయన అభిమానులు నన్ను ట్రోల్స్ చేస్తారు. కానీ, నాకు చాలా విషయాలు అతడి గురించి తెలుసు' అంటూ వివరించారు.

ప్రభాస్ పెళ్లి గురించి కూడా:ఇదే ఇంటర్వ్యూలో వేణు స్వామి.. రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి కూడా ప్రస్తావించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 'ప్రభాస్‌కు ఎప్పుడో పెళ్లి వయసు వచ్చేసింది కదా. మరి ఇప్పటి వరకూ అతడికి పెళ్లి ఎందుకు జరగలేదు. ఇది కూడా నాకు తెలుసు' అని అన్నారు. తద్వారా ప్రభాస్ జాతకంలో సమస్యలు ఉన్నాయని, అందుకే ఇలా జరుగుతున్నాయని వేణు స్వామి వెల్లడించారు.


Click it and Unblock the Notifications











