Venu Swamy: రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమ పెళ్లి.. విడాకులు.. అందుకే నాతో మాట్లాడటం లేదన్న వేణు స్వామి
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ముఖ్యంగా ఆయన వద్ద పలువరు హీరోయిన్స్, హీరోలు, నటులు చాలా మంది పూజలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఇటీవల రష్మిక మందన్నా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తనతో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పుకువచ్చాడు. అంతే కాదు రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ గురించి బయటపెట్టాడు వేణు స్వామి. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రముఖ సెలబ్రిటి జ్యోతిష్యుడు వేణు స్వామి కామెంట్స్ ఈ మధ్య వైరల్ గా మారుతున్నాయి. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఆయన పాపులారిటీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నప్పుడు వారు వీడిపోతారంటూ కామెంట్స్ చేసి.. కొన్నాళ్లకు సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడంతో తాను అప్పుడే చెప్పానంటూ ఆ వీడియో బయటకు రావడంతో.. ఆయన మరింత పాపులర్ అయ్యారు.
Recommended Video


అలా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తారనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు చాలా వరకు నిజం కావడంతో.. ఆయన్ని నమ్ముతూ వచ్చారు. ఇక వేణు స్వామి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం.. ఆయన ట్రోలింగ్ కు గురికావడం కూడా అవుతూ ఉంటుంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఇక కెరీర్ ఉండదని గతంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఈ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో... ప్రభాస్ ఫ్యాన్స్.. వేణు స్వామిని ఓ ఆట ఆడుకున్నారు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నాలుగు సినిమాలు చేస్తే మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయంటూ వేణుస్వామి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

ఇక ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా వేణు స్వామి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ వేణు స్వామిని అడుగుతూ... విజయ్, రష్మిక రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించింది. దానికి వేణు స్వామి అది అందరికి తెలిసిందే. రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. నిజమే అంటూ బయటపెట్టాడు. అయితే వారి జాతకాలు చూశాకా విడిపోతారని రష్మికకు ఈ విషయం చెప్పాను అంటూ చెప్పుకువచ్చాడు.

నేను డైరెక్ట్ గా ఈ విషయాన్ని రష్మికకే చెప్పడం.. ఆమెకు నచ్చలేదు... విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోకు అని సలహా ఇచ్చాను. ఆ విషయంలో నాకు రష్మికకి గొడవలు జరగడం వల్లే విభేధాలు వచ్చాయని చెప్పుకు వచ్చారు వేణుస్వామి. అప్పటికి వరకు నా క్లయింట్ గా ఉన్న రష్మిక ఆ గొడవతో దూరంగా ఉండిపోయిందని అన్నారు. అయినా నాకేం ఇబ్బంది లేదు అని వేణు స్వామి ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చాడు.


Click it and Unblock the Notifications











