త్రివిక్రమ్ తో చేయటమే శాపమైంది
నేను సినీ పరిశ్రమలోకి ప్రవేశించడమే త్రివిక్రమ్ రాసిన 'స్వయంవరం' వంటి మంచి స్క్రిప్టుతో ప్రవేశించా. నా కెరీర్‌కి అదే మరో రకంగా శాపం అనుకుంటున్నా అన్నారు హీరో వేణు. ఎందుకంటే...అందువల్లే వేణు సినిమా అంటే కచ్చితంగా ఏదో ఉంటుంది అనే నమ్మకం ఉన్న ప్రేక్షకులు ఉన్నారు అని చెప్పుకొచ్చారు. అదే సమస్యైంది అంటున్నారు. ఇక తన సినిమాలు గురించి చెబుతూ...'మాయగాడు', 'రామాచారి' సినిమాలు రెండూ రకరకాల కారణాలతో ఆలస్యమయ్యాయి.ఇప్పుడు ఆ రెండూ నెల తేడాతో విడుదలవుతున్నందుకు హ్యాపీ. ఈ నెల 16న 'మాయగాడు', వచ్చే నెల్లో 'రామాచారి' వస్తున్నాయి. ఇక నుంచీ సమయం వృథా చెయ్యకుండా చూసుకుందామనుకుంటున్నా. సబ్జెక్టులు నచ్చకపోవడం వల్లే ఎక్కువ సినిమాలు చెయ్యడం లేదు. ఆర్టిస్టు అన్నాక ఎత్తులు, పల్లాలు ఉంటాయి. అన్నిట్నీ సమన్వయించుకుంటూ ముందుకుపోవాలి అన్నారు.


Click it and Unblock the Notifications











