దేశ ముదురు కథ నాకు చెప్పి.. అల్లు అర్జున్‌తో సినిమా... అసలు విషయం బయటపెట్టిన సీనియర్ హీరో
ఒకప్పుడు అనేక కామెడీ సినిమాలతో హీరోగా టాలీవుడ్ లో స్థిరపడిన వేణు తోటెంపూడి కాలక్రమేణా సినిమాలు చేయడం మానేశారు. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆయన ఇప్పుడు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆలీతో సరదాగా అనే ఒక షోలో పాల్గొన్న ఆయన తన జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆలీతో సరదాగా
తాజాగా వేణుతో రామారావు ఆన్ డ్యూటీ దర్శకుడు శరత్ మండవ ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగానే ఆలీతో పలు విశేషాలను పంచుకున్నారు వేణు తోటెంపూడి. హైట్ ఎంత అని అడిగితే 6 అడుగుల మూడు అంగుళాలు అని చెప్పారు. అంతేగాక ఎంతోమంది ఆలీతో సరదాగా షో కి వెళుతున్నారు నువ్వు ఎప్పుడు వెళ్తావ్ రా అని మా అమ్మ అడిగే వారని అలా ఇప్పుడు ఆ కొరత తీరిపోయింది అని చెప్పుకొచ్చారు.

భారతీరాజా డైరెకక్షన్‌లో
ఇక కర్ణాటక ధార్వాడ్లో ఇంజనీరింగ్ చదివిన రోజులను గుర్తు చేసుకుంటూ మా స్నేహితుడి ఇంట్లో చదువుకుంటున్నానని చెప్పి సినిమాలకు వెళ్లే వాడిని అన్నారు. ఒకరోజు వాడి ఇంటికి వెళుతున్నాను అని చెప్పి సినిమాకి వెళ్తే వాడు మా ఇంటికి వచ్చాడని అలా దొరికిపోవడంతో మా నాన్న బెల్ట్ తెగేలా కొట్టారని చెప్పుకొచ్చారు. అంతేగాక భారతీరాజా డైరెకక్షన్‌లో మీ ఎంట్రీ ఇవ్వాలి..ఎందుకు మిస్సయిపోయింది ఆ ఛాన్స్ అని అలీ అడిగితే భారతీ రాజాను నేను బాగానే చేస్తాను అంటూ ఏవేవో యాక్ట్ చేసి చూపించానని అన్నారు.

అల్లు అర్జున్తో
ఆ తర్వాత వేణును నేనే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉండేదని భారతీ రాజా నన్ను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పాడు వేణు. అయితే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తాను చేయలేకపోయినా తర్వాత మరో సినిమా చేద్దామని పూరీ జగన్నాథ్ కలిశారని అలా దేశముదురు కథ వినిపించారని చెప్పుకొచ్చారు. అన్ని రకాల డిస్కషన్లు చేసి సినిమా మాత్రం అల్లు అర్జున్తో చేశారని వేణు కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

హిట్లు కొడితేనే
అయితే త్వరలో రాజకీయ అరంగ్రేటం ఉండే అవకాశం ఉందా అంటే కచ్చితంగా ఉంటుందని చెబుతూనే తన మేనమామ అంటే తన తల్లి సోదరుడు మాగంటి అంకినీడు మచిలీపట్నానికి పాతికేళ్ల పాటు ఎంపీగా పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాను హీరోగా ఉన్నప్పుడు కూడా నువ్వు సినిమాలు హిట్లు కొట్టాలని హిట్లు కొడితేనే నువ్వు మా మేనల్లుడివి అని చెప్పుకుంటాను లేకపోతే చెప్పను అని అనేవారని సరదాగా తన పాత సంగతులను గుర్తు తెచ్చుకున్నారు.

క్లారిటీ వచ్చే అవకాశం
అయితే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్డ్ మ్యారేజ్ అనే విషయానికి మాత్రం ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేదు. అయితే రాజకీయాల్లోకి వస్తావా రావా అంటే కచ్చితంగా వస్తాను అని కామెంట్ చేసిన విధంగా ప్రోమోలో చూపించారు. కానీ మొత్తం ఎపిసోడ్ విడుదలయితే గాని వేణు ఎలాంటి విశేషాలు పంచుకున్నాడు అనే వ్యవహారం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











