వరుణ్ సందేశ్ వేధించాడంటూ హీరోయిన్ ...ఫైర్
హైదరాబాద్ : వరుణ్ సందేష్ తాజాగా ప్రియతమా నీవచట కుశలమా అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్ గా చేసిన కోమల్ ఝూ వరుణ్ సందేశ్ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనను షూటింగ్ జరిగేటప్పుడు వరుణ్ వేధించేవాడని,అసభ్యకరమైన మెసేజ్ లతో విసిగించేవాడని ఆరోపించింది
అలాగే వరుణ్ చెప్పినట్లు తాను చేయకపోవటం వల్లే తన పాత్తరను చిత్రంలో కుదించేలా చేసాడని, అలాగే ప్రమోషన్ లో కూడా తనను ప్రక్కన పెట్టేలా చిత్ర యూనిట్ పై ఒత్తిడి చేసాడని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ఈ వ్యాఖ్యలను వరుణ్ సందేశ్ ఖండిచారు. ఆమె తన పరువు తీయటానికే ఇలా మాట్లాడుతోందని, మెసేజ్ లు పంపించింది నిజమే అయితే వాటిని చూపించాల్సిందిగా డిమాండ్ చేసారు. ఇక వీరిద్దరూ నటించిన ప్రియతమా నీ వచట కుశలమా చిత్రం ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












