twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్‌ ఖాన్ కి పదేళ్ల జైలు శిక్షా ?? టెన్షన్

    By Srikanya
    |

    ముంబయి: సల్మాన్‌పై హత్యతో సమానమైన శిక్షార్హ నరహత్య అభియోగం పై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు త్వరలోనే తేలనుంది. జూన్‌ 10న సల్మాన్‌ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది సెషన్స్‌ కోర్టు. ఈ అభియోగం కింద అతనికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాంతో ఆయన ఆయన అభిమానుల్లో,శ్రేయాభిలాషుల్లో టెన్షన్ మొదలైంది. వివరాల్లోకి వెళితే..

    2002, సెప్టెంబరు 28న సల్మాన్‌ఖాన్‌ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో రోడ్డు పక్కన పడుకున్న వారిని డీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి.

    వేగంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైన కేసులో తనపై 'హత్యతో సమానమైన శిక్షార్హ నరహత్య' (సెక్షన్‌ 304 ఐపీసీ) గా అభియోగం మోపటాన్ని సవాలు చేస్తూ సల్మాన్‌ ఖాన్‌ పెట్టుకున్న పిటిషన్‌పై ముంబయి సెషన్స్‌ కోర్టు జూన్‌ 10న తీర్పు ఇవ్వనుంది. ఈ మేరకు బుధవారం న్యాయమూర్తి యూబీ హిజిబ్‌ తన నిర్ణయాన్ని వెల్లడించారు.

    సల్మాన్‌ నగరంలో లేనందున ఆయనకు స్వీయ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు మన్నించింది. తాను వేగంగా కారు నడపడం వల్ల ఒకరు మరణిస్తారని, నలుగురికి గాయాలవుతాయని సల్మాన్‌ భావించలేదనే విషయాన్ని మేజిస్ట్రేట్‌ గుర్తించలేదని సల్మాన్‌ తరపు న్యాయవాది అశోక్‌ ముద్గరి వాదించారు.

    సల్మాన్‌పై హత్యతో సమానమైన శిక్షార్హ నరహత్య అభియోగం మోపడం పూర్తిగా అనుచితం అని, సాక్ష్యాధారాలకు విరుద్ధమని అన్నారు. ఈ అభియోగం కింద అతనికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ 17 మంది సాక్షులను విచారించిన అనంతరం కేసు తీవ్రమైందిగా పరిగణించింది. ఈ కేసు సెషన్స్‌ కోర్టులో విచారించదగిందని పునర్‌విచారణ కోసం కేసును సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేసింది.

    నిర్లక్ష్యంతో ఒకరి మరణానికి కారణమైనందున ఐపీసీ 304ఏ సెక్షన్‌ కింద సల్మాన్‌ను తొలుత మేజిస్ట్రేట్‌ విచారించిన సెక్షన్‌ కింద అతనికి దాదాపు రెండేళ్లు శిక్ష పడే అవకాశం ఉండేదని వాదోపవాదాలకు అవకాశమివ్వాలంటూ సల్మాన్‌ న్యాయవాది రాతపూర్వకంగా విన్నవించారు.

    మరోవైపు ముద్గరి విజ్ఞప్తిని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శంకర్‌ ఎరండే వ్యతిరేకించారు. మేజిస్ట్రేట్‌ నిర్ణయం సరైందేనని, సల్మాన్‌ తీవ్రమైన నేరం చేశాడని అన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న సల్మాన్‌ అంగరక్షకుడు రవీంద్ర పాటిల్‌ ఇటీవలే మరణించారు.

    ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్‌తో పాటే కారులో ఉన్నారని, వేగంగా నడపకూడదని, ఏదైన ప్రమాదం జరగుతుందని హెచ్చరించినప్పటికీ అతని మాటలు సల్మాన్‌ పట్టించుకోలేదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు.

    ప్రమాదం జరిగిన సమయంలో ఖాన్‌ పరిమితికి మించి మద్యంసేవించి ఉన్నారని అతని రక్తనమూనాలో 60 మిల్లీగ్రాముల అల్కహాల్‌ను గుర్తించినట్లు ఆయన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ కేసుతో సంబంధం గల మరో పిటిషన్‌పైన కోర్టు జూన్‌ 10న తీర్పు ఇవ్వనుంది.

    English summary
    A Mumbai sessions court will deliver its verdict on June 10 on the admissibility of an appeal filed by Bollywood actor Salman Khan challenging a magistrate's order invoking the charge of culpable homicide against him in a 2002 hit-and-run case. Sessions judge U B Hejib fixed June 10 for deciding the appeal after arguments concluded on Wednesday. The 47-year-old actor was granted exemption from personal appearance on a plea by his counsel Ashok Mudargi that he was out of town on account of professional engagement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X