twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దేనికైనా రెడీ’కి మరోసారి వెరీగుడ్ సర్టిఫికెట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే, అవమానించే సన్నివేశాలు ఏమీ లేవని ప్రాంతీయ సెన్సార్ బోర్డు మరోసారి తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాయి. ఈ మేరకు సెన్సార్ బోర్డుకు ఇచ్చిన నివేదికలో ఇదే విషయాన్ని పొందు పరిచాయి. రెండు కమిటీలు దేనికైనా రెడీ చిత్రాన్ని పరిశీలించాయని, ఇందులో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని పేర్కొడనడంతో పాటు, ఈ చిత్రం మంచి సామాజిక సంబంధాలు కలిగిన చిత్రంగా పేర్కొన్నాయి.

    ఈ చిత్రంలో బ్రాహ్మణులతో హలీమ్ తినిపించి సన్నివేశం గురించి ప్రస్తావిస్తూ...అది కేవలం సరదా సన్నివేశమే అని, బ్రాహ్మణులు నిజంగా హలీమ్ తిన్నట్లు చూపించలేదని స్పష్టం చేసారు. మిగతా సన్నివేశాలు కూడా సరదాగానే ఉన్నాయన్నారు. కేవలం ఒక సన్నివేశాన్ని చూసి సినిమా సినిమాపై ఆరోపణలు చేయడం తగదని, సినిమా మొత్తం చూస్తే అదొక మంచి సినిమా అని అందరూ అగీకరిస్తారని సెన్సార్ బోర్డు తాము జారీ చేసిన U/A సర్టిఫికెట్ ను సమర్థించుకున్నాయి.

    ఈ నేపథ్యంలో 'దేనికైనా రెడీ' సినిమా వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా ఈ వివాదం ముగిసే లోపు సినిమా బిజినెస్ పూర్తి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ గొడవల వల్ల నిర్మాతకు వచ్చిన నష్టమేమీ లేదని, పైగా సినిమాకు పబ్లిసిటీ పెరుగుతోందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

    ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు పరిశీలిస్తే...
    మంచు విష్ణు, హన్సిక జంటగా నటించిన 'దేనికైనా రెడీ' సినిమాలోని కొన్ని సన్నివేశాలపై బ్రాహ్మణ సంఘాలు నిరసనబాట పట్టడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. చిత్రాన్ని చూసిన కమిటీ సభ్యులు కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలిపారు. నిర్మాత వాదనలను కూడా విని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రకటించారు. ఇంతలోపే మోహన్ బాబు హై కోర్టును ఆశ్రయించడంతో కథ మళ్లీ మలుపు తిరిగింది. ఇంతకు ముందు హైకోర్టు.... మోహన్ బాబుకి మద్దతుగా తీర్పునిచ్చింది. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలున్నాయంటూ సర్కార్ కమిటీ వేయడాన్ని తప్పు పట్టింది... అసలు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చాక కమిటీలెందుకని ప్రశ్నించింది.

    హైకోర్టు స్టే ఇచ్చిన కొద్ది గంటల్లోపే మరో పిటీషన్ హైకోర్టులో దాఖలైంది. 'దేనికైనా రెడీ' సినిమాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని రఘునాథరావు అనే లాయర్ కోర్టుకెక్కారు. సినిమా మొత్తం ఒక కులం వారిని కించ పరిచే విధంగా ఉందని, సెన్సార్ బోర్డు సభ్యులు వాటిని పరిగణలోకి తీసుకోకుండా సర్టిఫికెట్ ఇచ్చారని, అది పూర్తిగా అవకతవకలతో కూడిన సెన్సార్ సర్టిఫికెట్ అని రఘునాథరావు తన పిటీషన్లో పేర్కొన్నారు.

    English summary
    AP Regional censor board certified that Manchu Vishnu starrer Denikaina Ready is very good movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X