అక్కడ ఆమె హాట్-ఇక్కడ ఈమె హాట్...
బాలీవుడ్ లో కరీనాకపూర్ చేయబోతున్న పనిని టాలీవుడ్ లో ప్రియమణి చేయబోతున్నది. '3 ఇడియట్స్"లో అమీర్ ఖాన్ తో జత కట్టిన జీరో సైజ్ బ్యూటీ కరీనాకపూర్ త్వరలో అతని మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ సరసన నటించనుంది. 'జానే తు యా జానేనా" చిత్రంతో తెరంగేట్రం చేసి తాజాగా 'ఐ హేట్ లవ్ స్టోరీస్"తో అందర్నీ మెప్పిస్తున్న ఇమ్రాన్ ఖాన్ వయసు పరంగా కరీనా కంటె చిన్నోడే. తనకంటె వయసులో పెద్దదైన అమ్మాయితో ప్రేమలో పడే కథతో బహుశా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారేమో చూడాలి.
ఇకపోతే..గతంలో ప్రియమణితో 'సాధ్యం" అనే చిత్రాన్ని నిర్మించిన కుమార్ బ్రదర్స్ అనే నిర్మాతలు తాజాగా సుమంత్ హీరోగా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విమలారామన్ ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ గా ప్రియమణి నటిస్తోంది. మరోవైపు వీరుపోట్ల దర్శకత్వంలో నాగార్జున అక్కినేనితో డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో ప్రియమణి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అంటె ఒక చిత్రంలో మామకు జంటగా నటిస్తున్న ప్రియమణి.. మరో చిత్రంలో మేనల్లుడితో జత కడుతోందన్నమాట!


Click it and Unblock the Notifications











