యంగ్ యువ సామ్రాట్ కి జన్మదిన శుభాకాంక్షలు...!
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యకు నేటి తో 25 సంవత్సరాలు నిండుతాయి. ఒక మగాడి జీవితంలో మైలురాయి లాంటి ఈ దశలో చైతన్యకు మంచి సినిమాలే రాబోతున్నాయి. రామ్ గోపాల్ వర్మ నిర్మాణం లో రూపొందిన చిత్రం 'బెజవాడ" లో త్వరలో చైతన్య ఒక మంచి పవర్ ఫుల్ పాత్ర లో కనిపించబోతున్నారు. తర్వాత రాధామోహన్ దర్శకత్వంలో 'గౌరవం" సినిమా చేయడానికి అంగీకరించాడు. తదుపరి చిత్రం 'ఆటోనగర్ సూర్య" కూడా మంచి మాస్ ఏక్షన్ చిత్రమే. తండ్రి నాగార్జునకు 'శివ" సినిమా ఎంతటి గుర్తింపు తెచ్చిందో , 'బెజవాడ" చిత్రం చైతన్యకు అంత గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నారు.
జోష్" చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన నాగచైతన్య రెండేళ్ళల్లోనే మూడు సినిమాలు చేసాడు. దీన్ని బట్టి నాగచైతన్య వరుసగా సినిమాలు చేస్తూ కెరియర్ ని ఎంత ఫర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చైతన్య మంచి 'లవర్ బాయ్"గా "100% లవ్" మరియు 'ఏ మాయ చేసావే" చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు 'బెజవాడ", ఆటోనగర్ సూర్య" లాంటి మాస్ చిత్రాలు చేస్తూ బ్యాలెన్స్డ్ గా ముందకు వెళుతున్నాడని పరిశీలకులు అంటున్నారు. ఈ సుభసందర్భంగా దట్స్ తెలుగు.కాం తరపున ఈ యువ సామ్రాట్ కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











