విశాల్-త్రిష ‘వేటాడు-వెంటాడు’ రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్ : తమిళ హీరో విశాల్ హీరోగా 5 కలర్స్ మల్టీమీడియా పతాకంపై నిర్మాత శ్రీనివాస్ దామెర ప్రేక్షకులకు అందిస్తున్న ద్విభాషా చిత్రం 'వేటాడు వెంటాడు' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. జనవరి 24న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈచిత్రం డిసెంబర్లోనే విడుదలవ్వాల్సి ఉండగా అనుకోని కారణాలతో సినిమాను వాయిదా వేసారు.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో చైనా, మలేషియా, బ్యాంకాక్ లలో చిత్రీకరించారు. ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాస్ దామెర మాట్లాడుతూ...'ఇటీవలే మేము విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన లభించింది. యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్ మూవీగా రూపుదిద్దుకున్న ఈచిత్రం హీరోగా విశాల్ కి చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇందులో విశాల్ కి జోడీగా అందాల నటి త్రిష నటించింది. డిసెంబర్లోనే సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. జనవరి 24న మా చిత్రాన్ని విడుదల గావించేందుకు సర్వ సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోందని శ్రీనివాస్ తెలిపారు.
విశాల్, త్రిష, మనోజ్ భాజ్ పాయ్, సునయన తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయా గ్రహణం : రిచర్డ్, ఎడిటింగ్ : రూపన్, పాటలు : అనంత శ్రీరాం, రామ జోగయ్య శాస్త్రి, కందికొండ వనమాలి, నిర్మాత : శ్రీనివాస్ దామెర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : తిరు.
హీరో విశాల్ నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో ఇప్పటి వరకు చాలానే విడుదలయ్యాయి. అయితే అందులో 'పందెం కోడి', 'వాడు వీడు' తప్ప ఏవీ కూడా పెద్ద గా ఆడలేదు. తాజాగా 'వేటాడు వెంటాడు' చిత్రం ద్వారా మరో సారి తెలుగు పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న విశాల్ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











