సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం...ప్రముఖ కమెడియన్ కన్నుమూత

సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలనాటి నటీ నటులు కాలం చెల్లిస్తున్నారు. ఇక తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ ఆర్ఎస్ శివాజీ కన్నుమూశారు. ఆయన ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో నటించి అలరించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. దీనితో చిత్రపరిశ్రమ ఓ కమెడియన్ ను కోల్పోయింది. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....

ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ ఆర్ఎస్ శివాజీ కన్నుమూశారు. ఈయన తెలుగు ప్రేక్షకులకు అంత సుపరిచితం కాకపోయినా... తమిళ ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆయన సినిమాలో కనిపిస్తే చాలు... సినిమాలో నవ్వులు పూస్తాయి. ఈయన ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ఈయన నటకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Vetaran Actor And Comedian RS Shivaji Dies at 66 Today

ఆర్ఎస్ శివాజీ అక్టోబర్ 26, 1956వ సంవత్సంరలో జన్మించారు. చైన్నైలో పుట్టి పెరిగిన ఈయన... సినిమా రంగంపై ఆసక్తితో పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఈయన కేవలం నటుడిగానే కాకుండా... అసిస్టెంట్ డైరెక్టర్ గా, సౌండ్ డిజైనర్, లైన్ ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమాలకు పని చేశారు. ఇక ఎన్నో వందల సినిమాల్లో కనిపించిన ఈయన... పలు టెలివిజన్ షోస్ లోనూ కనిపించారు.

ఇక ఈయన తండ్రి ఎంఆర్ సంతానం. ఈయనకు ఓ సోదరుడు కూడా ఉన్నారు. ఆయన సంతానం భారతి. ఈయన కూడా తమిళ నటుడు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాదు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. 1991లో వచ్చిన కమల్ హసన్ గుణ సినిమాకు ఈయనే దర్శకత్వం వహించారు. ఎన్నో సినిమాల్లో నటిస్తూ... ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.

ఇక శివాజీ విషయానికి వస్తే... ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి, వెయ్యి అబద్దాలతో పాటు... కమల్ హాసన్ తో కలిసి గుణ, నాయకుడు, సత్యం శివం, విక్రమ్ వంటి సినిమాల్లో నటించారు. ఇక సూర్యతో యువ, ఆకాశమే హద్దురా వంటి సినిమల్లో నటించారు. ఇక సాయి పల్లవితో కలిసి గార్గీ సినిమాలో నటించారు. ఒక తండ్రిగా ఆయన అందులో కనిపించిమెప్పించారు.

శివాజీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షిణించడంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన మృతితో తమిళ పరిశ్రమతో పాటు.. ఆయన అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇక ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభుతి వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X