twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ వెటరన్ యాక్టర్ హంగల్ కన్నుమూత

    By Nageswara Rao
    |

    బాలీవుడ్ సినీనటుడు ఎకె హంగల్ (96) కన్నుమూశారు. ఈ నెల 13న ఆయన బాత్ రూమ్‌లో కాలు జారి క్రింద పడ్డాడు. అతని కుడి కాలు తొడ ఎముక చిట్లింది. తీవ్ర ఆస్వస్దతో 16న ఆషాపరేఖాన్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుకూ ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఆయన షాకీన్, షోలే, నమక్ హరామ్ వంటి దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించారు. హంగల్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

    ఈరోజు మధ్యాహ్నాం ప్రముఖ విలే పార్లే స్మశానము వాటికలో దహన సంస్కారాలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలియిజేశారు. ఆసుపత్రి వర్గాలు అధికారిక సమాచారం ప్రకారం హంగల్ గత కొన్ని రోజులుగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ సరిగా పని చేయక పోవడం వల్ల చికిత్సకు స్పందించడం లేదని తెలిపారు. హంగల్ భార్య గతంలోనే చనిపోయినప్పటికీ.. హంగల్ మాత్రం తన కొడుకు విజంయ సంరక్షణలో ఉన్నాడు.

    1967 నుండి హంగల్‌ బాలీవుడ్ చిత్రసీమతో తత్సంబంధాలను కొనసాగిస్తున్నాడు. పరిచయ్, షోలే సినిమాలో నటించిన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. 2011లో తాను ఆర్దిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుపగా.. హాలీవుడ్ మెగా హీరోలు అమితాబచ్చన్, అమీర్ ఖాన్ ఇద్దరూ ఫైనాన్స్ పరంగా ఆదుకున్నారు. గత మే నెలలో వచ్చిన మధుబాల టివి షో హంగల్ కు చివరిది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదగా పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Veteran Bollywood actor A.K. Hangal passed away here Sunday after a prolonged illness aggravated by a recent hip fracture, his family said. Hangal was 96.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X