twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐసీయూలో చేరిన బాలీవుడ్‌ దిగ్గజం

    By Srikanya
    |

    Dilip Kumar
    ముంబయి: ఛాతీనొప్పి కారణంగా బాలీవుడ్‌ దిగ్గజం దిలీప్‌కుమార్‌ ఆదివారమిక్కడి లీలావతి ఆస్పత్రిలో చేరారు. దిలీప్‌ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 'కింగ్‌ ఆఫ్‌ ట్రాజెడీ'గా గుర్తింపు పొందిన దిలీప్‌కుమార్‌(90) మొఘల్‌-ఏ-ఆజం, గంగాజమున, దేవ్‌దాస్‌ తదితర చిత్రాల్లో నటించారు.

    పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1922లో డిసెంబరు 11న జన్మించారు. 1954లో నెలకొల్పిన ఫిలింఫేర్‌ పురస్కారాల్లో మొదటి ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. 1991లో పద్మ భూషణ్‌, 1994లో దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాలను పొందారు. 2000-2006 కాలంలో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. పాకిస్థాన్‌ తన అత్యున్నత పౌర పురస్కారం 'నిషాన్‌-ఏ- ఇంతియాజ్‌'ను 1998లో ఆయనకు అందజేసింది.

    ఏడు పదుల సినీ జీవితాన్ని పండించుకున్న దిలీప్ కుమార్ జీవితంలోనూ ఎత్తుపల్లాలున్నాయి. అయినా వాటిని అధిగమించి తన ఆత్మవిశ్వాసానే్న కాదు, ఇతరులకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్నీ నిలబెట్టుకున్నారు. దేవానంద్, రాజ్‌కపూర్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న సమయంలో పలు విజయాలను నమోదు చేసుకున్న దిలీప్‌కు భారీ పారితోషికాన్నిచ్చి సినిమాలు నిర్మించేందుకు ఎందరో ముందుకొచ్చినా..తన నియమాన్ని మాత్రం ఆయన వదులుకోలేదు. సుదీర్ఘ కెరీల్‌లో నటించిన సినిమాలు తక్కువే అయినా వేటికవి సాటిగా మిగిలిపోయాయి.

    అగ్ర నటులందరూ తమతమ కథానాయికల విషయంలో పట్టుబట్టడం అన్నది సినీ రంగంలో మొదటి నుంచీ ఉన్నదే.. దిలీప్‌కుమార్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ప్రాధాన్యతలు ఇచ్చేవారు కాదు..మధుబాల నుంచి సైరాబాను వరకూ అనేక మంది కథానాయికలతో నటించారు. అందరితోనూ విజయాలు సాధించారు. ఏ పాత్ర వేసినా అందులో మమేకం కావడం దిలీప్ లక్షణం.. సలీంగా వేస్తే.. సలీం కనిపిస్తాడు..అతడి ప్రేమైక జీవితం సాక్షాత్కరిస్తుంది. దేవదాసు పాత్ర వేస్తే.. ఔరా అనిపిస్తుంది.. క్రాంతిలో విప్లవకారుడిగా నటించినా..ఆ పాత్ర హుందాతనం మరింత పెరుగుతుంది. ఆందుకే దిలీప్ నటుడు కాదు, నటులకే నటుడు..నటనకే ఓ ఆలయం. విశ్వవిద్యాలయం కూడా.. ఆయన త్వరగా కోలుకోవాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.

    English summary
    Veteran actor Dilip Kumar, 90 was hospitalised late on Sunday evening after he suffered from a heart attack. Sources in Lilavati Hospital where he was admitted said that he was complaining of pain in the chest and breathlessness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X