ప్రముఖ తెలుగు సినీ నటుడు కాంతారావు ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉంది. కొంతకాలంగా ఊహిరితిత్తుల కేన్సర్ తో బాధపడుతున్న ఆయనను ఐదో తేదీన యశోద ఆస్ప్రత్తికి తరకలించారు. కేన్సర్ వ్యాది..ఊపిరితిత్తులనుండి మొదడుకు వ్యాపించిందని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ శ్రీనివాసన్ నిర్దారించారు. ఆరోగ్యం విషమించటంతో ఆయన్ని ఐసియూకి తరలించారు. ఎనభై ఆరు సంవత్సరాల కాంతారావు ఇప్పటికీ దాదాపు నాలుగు వందల సినిమాలకు పైగానే చేసారు. అందులో అరవైకి పైగా హీరోగా చేసారు. జానపదాల హీరోగా పేరుగాంచిన కాంతారావు త్వరగా కోలుకోవాలని దట్స్ తెలుగు కోరుకుంటోంది.
Story first published: Thursday, January 8, 2009, 12:04 [IST]