చిరంజీవి గాడ్ ఫాదర్ అతడే..సైరా పెళ్లి అతడి వల్లే!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటుడు నాజర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ తరహా పాత్రలో చిరంజీవి నటిస్తుండడం ఇదే తొలిసారి.
నాజర్ పాత్ర సైరా చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు అతని టీం ఉయ్యేలవాడ జీవిత చరిత్ర గురించి బాగా అధ్యయనం చేసి స్క్రిప్ట్ రెడీ చేసారు. నాజర్ ఈ చిత్రంలో చిరంజీవికి గాడ్ ఫాదర్ పాత్రలో కనిపంచబోతున్నట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వివాహం విషయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఉన్నారు. ఆయన పాత్రలోనే నాజర్ నటించబోతున్నారట. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.



Click it and Unblock the Notifications











