నేలకొరిగిన నటదిగ్గజం.. శశికపూర్ ఇకలేరు.. రొమాంటిక్ హీరో జీవిత విశేషాలు..

By Rajababu

80, 90 దశకాలలో రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాలతో యువతను ఉర్రూతలూగించిన శశికపూర్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. బ్రిటీష్ పాలన కాలంలో శశికపూర్ 1938 మార్చి 18న జన్మించారు. అతని అసలు పేరు బల్బీర్ రాజ్ కపూర్. అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి హిందీ చలన చిత్ర సీమలో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకొన్నారు. నిర్మాతగా పలు చిత్రాలను రూపొందించారు.

 కపూర్ వంశంలో దిగ్గజ నటుడు

కపూర్ వంశంలో దిగ్గజ నటుడు

ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత పృథ్వీరాజ్ కపూర్‌కు శశికపూర్ మూడో కుమారుడు. ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ కపూర్, షమ్మీ కపూర్‌కు సోదరుడు. వందకు పైగా చిత్రాల్లో శశికపూర్ నటించి మెప్పించారు.

బాలనటుడిగా సినిమాల్లోకి

బాలనటుడిగా సినిమాల్లోకి

చిన్నతనంలోనే తండ్రి పృథ్వీరాజ్ కపూర్ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రాల్లో శశికపూర్ నటించాడు. 1940లో బాలనటుడిగా సంగ్రామ్ (1950), దానా పానీ (1953) చిత్రాల్లో నటించి మెప్పించాడు. రాజ్ కపూర్ నటించిన ఆగ్, ఆవారా చిత్రాల్లో బాలనటుడిగా శశికపూర్‌కు మంచి పేరు లభించింది. ఈ చిత్రాల్లో బాల రాజకపూర్‌గా నటించి మెప్పించారు.

 శశికపూర్ ప్రేమ.. పెళ్లి

శశికపూర్ ప్రేమ.. పెళ్లి

తన సినీ జీవిత ప్రయాణంలో హాలీవుడ్ నటి జెన్నిఫర్ కెండాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తన వదిన గీతా బాలీ సహకారంతో జెన్నిఫర్‌ను శశికపూర్ వివాహం చేసుకొన్నాడు. వారికి కునాల్ కపూర్, సంజనా కపూర్, కరణ్ కపూర్ ముగ్గురు సంతానం కలిగారు. వీరంతా ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

 ఫాల్కే అవార్డుతో సత్కారం

ఫాల్కే అవార్డుతో సత్కారం

భారత సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా 2011లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆ తర్వాత 2014లో దాదా సాహెబ్ ఫాల్కేతో భారత ప్రభుత్వం సన్మానించింది. కపూర్ వంశంలో పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్‌ తర్వాత దేశంలోని అత్యుత్తమ సినీ పురస్కారాన్ని పొందిన వ్యక్తిగా ఓ ఖ్యాతిని సంపాదించుకొన్నారు.

 అమితాబ్‌తో కలిసి..

అమితాబ్‌తో కలిసి..

బిగ్ బీ అమితాబ్‌తో శశికపూర్ కలిసి నటించిన చిత్రాలు బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీవార్‌లో ఆయన పోషించిన ఇన్స్‌పెక్టర్ పాత్రకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. నమక్ హలాల్ చిత్రంలో కూడా మంచి ఘన విజయం సాధించింది. ఓ సందర్భంలో అమితాబ్‌కు ధీటుగా ‘మేరే పాస్ మా హై' అని దీవార్‌లో చెప్పిన డైలాగ్ దేశవ్యాప్తంగా మారు మోగింది. ఇప్పటికి ఆ డైలాగ్ ప్రేక్షకుల నోట వినిపిస్తూనే ఉంటుంది. దీవార్ చిత్రంలో అద్భుతమైన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డును అందుకొన్నారు.

ధర్మపుత్రతో హీరోగా

ధర్మపుత్రతో హీరోగా

1961లో ధర్మపుత్ర చిత్రంతో తొలిసారి హీరోగా మారాడు. ఆ తర్వాత ప్రేమ్ పాత్ర, వక్త్, ఆమ్నే సామ్నే, హసీనా మాన్ జయేగి, కన్యాదాన్, రాజ సాహెబ్, అభినేత్రి, రోటి కప్డా ఔర్ మకాన్, దీవార్, కభీ కభీ, త్రిశూల్, సుహాగ్, షాన్, క్రాంతి, సిల్ సిలా, ఇజ్లత్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

 నిర్మాతగా, దర్శకుడిగా

నిర్మాతగా, దర్శకుడిగా

నిర్మాతగా జునూన్, కలియుగ్, 36 చౌరంగీ లేన్, విజేత, ఉత్సవ్, అజూబా చిత్రాలను నిర్మించారు. అజూబా చిత్రానికి శశి కపూర్ దర్శకత్వం వహించారు. రష్యా భాషలో వోజ్ వర్షిచెనియే బాగ్గాద్కోదో వోరా అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం.

 ఆంగ్ల చిత్రాల్లో నటించిన శశి

ఆంగ్ల చిత్రాల్లో నటించిన శశి

కేవలం హిందీ భాషలోనే కాకుండా ది హౌస్ హోల్డర్, షేక్ స్పియర్ వాలా, ప్రెట్టి పాలీ, బాంబే టాకీ, సిద్ధార్థ, హార్ట్ అండ్ డస్ట్, సమ్మీ అండ్ రోసి గెట్ లెయిడ్, ది డిసీవర్స్, జిన్నా, సైడ్ స్ట్రీట్స్ అనే ఆంగ్ల చిత్రాల్లో కూడా నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X