కంటతడి పెట్టిన సీనియర్ నటి కవిత

By Srikanya

Veteran actress Kavitha breaks down
హైదరాబాద్ :చిత్ర పరిశ్రమలో 35యేళ్లుగా కొనసాగుతున్న తనకు వందేళ్ల చిత్రోత్సవాలకు సంబంధించిన ఆహ్వానం అందలేదని సీనయర్ నటి కవిత కంటతడి పెట్టారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ నాలా పేరున్న నటీనటులు చాలామందికి ఆహ్వానం అందలేదు. నిర్వాహకులు అంతమంది ఉన్నా.. ఎవ్వరికీ గుర్తుకురాకపోవడం దురదృష్టకరం అంటూ బాధపడ్డారు.

కవిత మాటల్లోనే... ''బాలనటిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించాను. ఎన్టీఆర్‌, ఎమ్‌.జి.ఆర్‌, శివాజీగణేశన్‌ లాంటి ప్రముఖలందరితోనూ నటించాను. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో 130 సినిమాల్లో హీరోయిన్ గా నటించాను. వందేళ్ల చిత్ర పరిశ్రమలో 35 యేళ్లుగా కొనసాగుతున్న ఓ నటికి ఆహ్వానం అందలేదు. పరిశ్రమ నాకు ఇచ్చిన గౌరవం ఇది'' అన్నారు.

అలాగే.... చెన్నైలో జరుగుతున్న చిత్రోత్సవాలకు హాజరైన చాలామంది నాకు ఫోన్‌ చేశారు. ఎక్కడున్నావని అడిగారు. వాళ్లకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. చిత్ర పరిశ్రమలో కాకా పట్టేవాళ్లకే న్యాయం జరుగుతోంది. రెండు మూడు సినిమాల్లో నటించినవారికి కూడా ఆహ్వానం అందింది. ఫలానావాళ్ల కొడుకు, ఫలానావాళ్ల కూతురు అంటూ ఆహ్వానాలు పంపారు. ఇన్ని సినిమాల్లో నటించిన నాకు మాత్రం పిలుపురాలేదు అన్నారామె.

ఇక నాలా పేరున్న నటీనటులు చాలామందికి ఆహ్వానం అందలేదు. నిర్వాహకులు అంతమంది ఉన్నా.. ఎవ్వరికీ గుర్తుకురాకపోవడం దురదృష్టకరం. కళాఖండాల్లాంటి సినిమాల్లో నటించాను. మనిషిని మనిషిగా గౌరవించే సంప్రదాయం చిత్ర పరిశ్రమలో లేదు...అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X