సీనియర్ నటి మనోరమకు అస్వస్థత

గత కొంతకాలంగా మనోరమ అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వినిపించాయి. మోకాలు నొప్పితో సతమతమవుతున్నారు. కొన్ని నెలల కిందట ఇంట్లో బాత్‌రూంలో పడిపోవడంతో తేనాంపేట ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర చికిత్సల అనంతరం నయమవడంతో ఇంటికి తీసుకొచ్చారు.
ఇంటికి వచ్చిన దగ్గరనుంచి ఆమె మళ్లీ నటనపై దృష్టిపెట్టారు. షారుఖ్ హీరోగా నటిస్తున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తమిళంలో ఒకట్రెండు సినిమాలు ఒప్పుకున్నారు. శుక్రవారం రాత్రి మళ్లీ అనారోగ్యానికి గురవడంతో సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











