twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ నటి మనోరమకు అస్వస్థత

    By Srikanya
    |

    Manorama
    చెన్నై : అలనాటి హాస్యనటి, సీనియర్ క్యారక్టర్ ఆర్టిస్ట్ మనోరమ అస్వస్థతకు గురికావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఆర్‌, శివాజి కాలం నుంచి వందలాది చిత్రాల్లో నటిస్తూ.. ఇప్పటికీ 'ఆచ్చి' (బామ్మ)గా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

    గత కొంతకాలంగా మనోరమ అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వినిపించాయి. మోకాలు నొప్పితో సతమతమవుతున్నారు. కొన్ని నెలల కిందట ఇంట్లో బాత్‌రూంలో పడిపోవడంతో తేనాంపేట ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర చికిత్సల అనంతరం నయమవడంతో ఇంటికి తీసుకొచ్చారు.

    ఇంటికి వచ్చిన దగ్గరనుంచి ఆమె మళ్లీ నటనపై దృష్టిపెట్టారు. షారుఖ్‌ హీరోగా నటిస్తున్న 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తమిళంలో ఒకట్రెండు సినిమాలు ఒప్పుకున్నారు. శుక్రవారం రాత్రి మళ్లీ అనారోగ్యానికి గురవడంతో సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

    English summary
    Veteran actress 'Aachi' Manorama has been hospitalized following ill health. She looked fine and active for the past few months after having gone through a couple of minor surgeries in the last few years. She was admitted in a private hospital in T Nagar yesterday and the doctors have announced that her health is better today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X