Just In
- 9 min ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 10 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 11 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 11 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
Don't Miss!
- News
ఉలిక్కిపడ్డ విశాఖ: మరో భారీ అగ్నిప్రమాదం: రాత్రంతా: ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ వ్యాపారవేత్త నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు: ఒకప్పటి బాలీవుడ్ తార..

ఒకప్పటి బాలీవుడ్ తార జీనత్ అమన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కారు. ఓ వ్యాపారవేత్త తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యాపారవేత్త ఆమె కుటుంబానికి బాగా పరిచయం ఉన్న వ్యక్తే కావడం గమనార్హం.

ఎవరా వ్యాపారవేత్త?:
అమర్ ఖన్నా అనే వ్యాపారవేత్త గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని జీనత్ అమన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు.

పరారీలో నిందితుడు:
జీనత్ అమన్ ఫిర్యాదు మేరకు సెక్షన్స్-304D, 509ల కింద ముంబై జుహు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అమర్ ఖన్నా పరారీలో ఉన్నట్లు గుర్తించారు.

పోలీసుల వివరణ:
జీనత్ అమన్ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అమర్ ఖన్నాతో జీనత్ అమన్ కు చాలాకాలంగా పరిచయం ఉందని, కొన్ని విభేదాల కారణంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలు చెడిపోయానని తెలిపారు. అప్పటినుంచి జీనత్ అమన్ అమర్ ఖన్నాతో మాట్లాడటం మానేసిందన్నారు.

పద్దతి మారకపోవడంతోనే:
జీనత్ అమన్ తనతో మాట్లాడకపోతుండటంతో.. అమర్ ఖన్నా ఆమెను చాలారోజుల నుంచి ఫాలో అవుతున్నారని, పదేపదే ఫోన్ కాల్స్ చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అతని తీరులో మార్పు రాకపోవడంతోనే ఆమె తమను ఆశ్రయించిందని చెప్పారు.

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి..:
డెబ్బై, ఎనభై దశకంలో జీనత్ అమన్ ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో మిస్ ఆసియా/పసిఫిక్ టైటిల్ కూడా దక్కించుకుంది. హరే రామ హరే కృష్ణ, సత్యం శివం సుందరం, హీరా పెన్నా, యాదోంకి బరాత్, డాన్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. జీనత్ అమర్ భర్త మజర్ ఖాన్ 1998లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.