twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాస్యనటుడు సుత్తివేలు మృతి..సంతాపం

    By Srikanya
    |

    చెన్నై : అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలుకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చైన్నెలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందకు పలువురు బయలుదేరివెళ్లారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో ఈ సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు తెలుగు, తమళ సినీ ప్రముఖులు సంతాపం అర్పించారు.

    ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు(65) స్వగృహంలో ఈ తెల్లవారుజామున 3.30గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందారు. సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు. 1947 ఆగస్టు 7న జన్మించిన ఆయన 200కుపైగా చిత్రాల్లో నటించారు. నాటకాలపై మక్కువతో ఏడో ఏటనే రంగస్థలంపై అడుగుపెట్టారు. ముద్దమందారం ద్వారా తెలుగుతెరకు పరిచయమయ్యారు. జంధ్యాల సినిమాల ద్వారా హాస్యనటుడిగా పేరు సంపాదించుకున్నారు.

    1982లో వచ్చిన నాలుగు స్తంభాలాట సినిమాలో ఆయన పేరు 'సుత్తి'. 250కి పైగా చిత్రాలలో నటించిన సుత్తివేలు తొలి చిత్రం ముద్దమందారం. ఈ సినిమా విజయవంతమవడంతో ఆయన పేరు సుత్తివేలుగా మారింది. 1985లో వందేమాతరం చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు లభించింది. సుత్తివీరభద్రరావుతో కలిసి సుత్తివేలు పండించిన హాస్యాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. వీరిద్దరిని సుత్తి జంటగా కూడా పిలిచేవారు. సుత్తివేలు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. దూరదర్శన్‌లో వచ్చిన 'ఆనందోబ్రహ్మ' మంచి పేరు తీసుకువచ్చింది. చివరి దశలో కూడా పలు టీవీ ధారావాహికల్లో కనిపించారు. సుత్తివేలుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతికి ధట్స్ తెలుగు సంతాపం తెలియచేస్తోంది.

    English summary
    Famous Telugu Comedian Suttivelu Passed away in Chennai. Suttivelu 65 is facing serious helath problems from last few months. He born in august 7 1947 and acted in 200 plus films. suttivelu acted in small screen also. In 1982 a film called NALUGU STAMBALATA released in this movie his name is sutti from that film he became as suttivelu his original name is Kurumaddali Lakshmi narasimha. Suttivelu has wife and 4 son and daughters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X