దర్శకుడు బివిఎల్ ప్రసాద్ ఇక లేరు

By Bojja Kumar

Veteran director BLV Prasad passes away
హైదరాబాద్ : టాలీవుడ్ చిత్రసీమకు దర్శకుడిగా సేవలు అందించిన బివిఎల్ ప్రసాద్(57) ఇక లేరు. అనారోగ్యం పాలై దాదాపు మూడేళ్లుగా కోమాలో ఉన్న ఆయన శనివారం రాత్రి మరణించారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు, సుమన్, బానుచందర్ లతో ఆయన పలు చిత్రాలు నిర్మించారు.

ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో కృష్ణ హీరోగా వచ్చిన 'విష్ణు', సుమన్ హీరోగా రూపొంది 'బందిపోటు రుద్రయ్య' చిత్రాలతో పాటు ఉగ్రనేత్రుడు, మాయదారి మరిది, ఇద్దరు మిత్రులు, భాను చందర్ హీరోగా వచ్చిన రౌడీ రాజకీయం తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. మొత్తం 23 చిత్రాలకు ప్రసాద్ దర్శకత్వం వహించారు.

బివిఎల్ ప్రసాద్ మరణంతో టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం నెలకొంది. చాలా ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ.... ఆయనతో పని చేసిన నిన్నటి తరం నటీనటులు ప్రసాద్ పనితీరు, దర్శకత్వం శైలి ప్రత్యేకంగా ఉంటుందని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X