twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రాము’,‘అవే కళ్లు’,‘నాదీ ఆడజన్మే’చిత్రాల దర్శకుడు ఇక లేరు

    By Srikanya
    |

    హైదరాబాద్: అలనాటి తమిళ,తెలుగు సూపర్ స్టార్స్ ఎన్టీయార్, ఎమ్జీయార్, శివాజీ గణేశన్, సూపర్‌స్టార్ కృష్ణ, రజనీకాంత్‌లతో పని చేసిన నిన్నటి తరం దర్శకుడు డాక్టర్ ఎ.సి. త్రిలోకచందర్ ఇక లేరు. దాదాపుగా ఆరు దశాబ్దాలుగా సినీ రంగంతో అనుబంధమున్న ఆయన నిన్న (బుధవారం) మధ్యాహ్నం 2.45 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. త్రిలోకచందర్ పేరు చెప్పగానే తెలుగువారికి ఎన్టీయార్ నటించిన 'రాము', 'నాదీ ఆడజన్మే', హీరో కృష్ణ 'అవే కళ్ళు' తో సహా పలు హిట్ సినిమాలు గుర్తొస్తాయి.

    తమిళనాడులోని వెల్లూరు జిల్లా ఆర్కాట్ ప్రాంతానికి చెందిన త్రిలోకచందర్ పూర్తి పేరు - ఎ. చెంగల్వరాయ ముదలియార్ త్రిలోకచందర్. తమిళ, తెలుగు, హిందీల్లో 65 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.ఎ.వి.ఎం.తో అనుబంధం ఉంది. అర్దశాస్త్ర్రంలో ఎం.ఏ చేసిన ఆయన ...సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతూ, సినిమాల్లోకొచ్చారు.

    ప్రముఖ నిర్మాణ సంస్ద ఏవీఎం సంస్థ నిర్మించిన 'వీరతిరుమగళ్‌' చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 65 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

    Veteran Director Trilokchander passes away

    తెలుగులో ఎన్టీఆర్‌తో 'నాదీ ఆడజన్మే' (1965), 'రాము' (1968), 'పవిత్ర హృదయాలు' (1971) చిత్రాలు, కృష్ణతో 'అవే కళ్లు' (1967), 'ముత్తైదువ' (1979) చిత్రాల్ని ఆయన రూపొందించారు. అలాగే కృష్ణ నటించిన 'ఇన్‌స్పెక్టర్‌ భార్య'కు దర్శకత్వ పర్యవేక్షణ వహించారు.

    ఇక తమిళ నటుడు శివకుమార్ (హీరో సూర్య తండ్రి)ని 'కాక్కుమ్ కరంగళ్' ద్వారా పరిచయం చేసిన త్రిలోక్, 'భద్రకాళి'('77) ద్వారా మ్యూజిక్ డెరైక్టర్ ఇళయరాజాని తెలుగుకు పరిచయం చేసారు. మురళీమోహన్, జయప్రద జంటగా నటించిన 'భద్రకాళి'ని డైరెక్ట్‌ చేసిన ఆయన, అదే కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం 'శాంతి'కి స్ర్కీన్‌ప్లే సమకూర్చారు.

    ఆయన మరో గొప్పతనం ...ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో 'ఆస్కార్' అవార్డులకు మన దేశం తరుపున ఎంట్రీగా వెళ్ళిన తొలి దక్షిణ భారత సినిమా 'దైవ మగన్' కూడా త్రిలోకచందర్ దర్శకత్వం వహించినదే.

    ఆయన కెరీర్ లో 5సార్లు 'ఫిల్మ్‌ఫేర్' అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ 'కలైమామణి' బిరుదు అందుకున్నారు. తమిళనాడు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌గా నాలుగుసార్లు బాధ్యతలు నెరవేర్చారు.

    English summary
    'Naadi Aada Janme', 'Ramu', 'Ave Kallu' fame Veteran director A C Trilokchander is no more. 86-year-old director passed away in Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X