twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కన్నడ హీరో మృతి.. అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం.. ఏమైందంటే?

    |

    ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆమె మరణ వార్త మరువకముందే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. మలయాళ సినీ పరిశ్రమలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు తాజాగా సినీ నటుడు అర్జున్ మామ రాజేష్ కన్నుమూసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

    తెల్లవారుజామున

    తెల్లవారుజామున

    ప్రముఖ కన్నడ నటుడు, 'కళా తపస్వి' అని పిలువబడే రాజేష్ శనివారం తెల్లవారుజామున ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. మూత్రపిండాల, శ్వాసకోశ మరియు వయస్సు సంబంధిత వ్యాధుల కారణంగా ఫిబ్రవరి 9న బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తెల్లవారుజామున 2:30 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

    చిన్నతనంలోనే

    చిన్నతనంలోనే

    రాజేష్ వయసు 89 సంవత్సరాలు కాగా శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో రాజేష్ 150కి పైగా సినిమాల్లో నటించారు. అతని ఆత్మకథ, 'కళా తపస్వి రాజేష్ ఆత్మకథే' పేరుతో 2014లో విడుదలైంది. ఇక ఆయన కుమార్తె ఆశా రాణి బహుభాషా నటుడు అర్జున్ సర్జా భార్య. రాజేష్ 1935లో బెంగళూరులో జన్మించారు. చిన్నతనంలోనే నాటకరంగంపై ఆసక్తి పెంచుకుని తల్లిదండ్రులకు తెలియకుండా సుదర్శన నాటక మండలిలో చేరాడు.

    వీర సంకల్ప'తో

    వీర సంకల్ప'తో

    ట్యూషన్‌లకు వెళతాననే నెపంతో రాజేష్‌ తన పేరు విద్యాసాగర్‌గా మార్చుకుని మరీ థియేటర్‌ గ్రూపులో చేరాడు. అలా నాటకాలాతొహ్ బిజీగా ఉంటూనే ఆయన ప్రభుత్వ కార్యాలయంలో టైపిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించారు. అలాగే శక్తి నాటక మండలి అనే పేరుతో తన స్వంత థియేటర్ గ్రూప్‌ను ప్రారంభించాడు. అలా నాటకాల్లో ప్రయోగాలు ఆయనని సినిమాల వైపు నడిపించాయి. అలా 'వీర సంకల్ప'తో వెండితెర అరంగేట్రం చేశాడు.

    సాయంత్రం అంత్యక్రియలు

    సాయంత్రం అంత్యక్రియలు

    1968లో సూపర్‌హిట్‌గా నిలిచిన 'నమ్మ ఊరు'లో సోలో హీరోగా నటించినప్పుడు ఆయన పేరు రాజేష్‌గా మార్చబడింది. గంగే గౌరి ', ' సతీ సుకన్య ', ' బెలువలాడ మదిలల్లి ', 'కప్పు బిలుపు', ' బృందావన ' ఆయన ప్రధాన సినిమాలు. సినీ పరిశ్రమలోని ప్రముఖ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. శనివారం సాయంత్రం వరకు ప్రజలు నివాళులర్పించేందుకు వీలుగా రాజేష్ భౌతికకాయాన్ని ఆయన విద్యారణ్యపుర నివాసంలో ఉంచుతారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

    సంతాపం

    సంతాపం

    ఆయన మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంతాపం తెలిపారు. 'కన్నడ సినీ ప్రముఖ నటుడు శ్రీ రాజేష్‌ మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను భరించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నారు. 60వ దశకంలో కన్నడ సినిమా రంగ ప్రవేశం చేసిన ఆయన తన కెరీర్‌లో వందలాది సినిమా అవార్డులను గెలుచుకున్నారు. రాజేష్ కుమార్తె ఆశారాణి ఒక సినీ నిర్మాత. ఆమె నటుడు అర్జున్ సర్జాను వివాహం చేసుకున్నారు.

    English summary
    Veteran Kannada actor 'Kala Thapasvi' Rajesh passes away.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X