చిరు, రాఘవేంద్రరావులపై నిప్పులు... ఓ నిర్మాత పుస్తకం
ఇక ఈ పుస్తకంలో ఏమి కాంట్రావర్శి విషయాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందంటే...(ఈ విషయాలు ఉన్నాయని మురారి..ఓ టీవీ ఛానెల్ చర్చా వేదికలో ఒప్పుకున్నారు)
చిరంజీవి వల్లే తెలుగు సినిమాల్లో పాటలు పాడయ్యాయి. అసభ్యతకు,రొమాన్స్ కు మధ్య తేడా తొలిగిపోయింది. ఉదాహరణకు రగులుతోంది మొగలిపొద పాట ని ప్రస్దావించారు.
అలాగే నాగార్జున జానికి రాముడు సినిమాని ..నాగార్జున కుటుంబమే చెత్త అని అంది.
సంగీత దర్శకుడు చక్రవర్తికి స్వరాలు రావు.
రాఘవేంద్రరావు డబ్బు ఎగ్గొట్టాడు.
చిరంజీవి అన్నిటిలోనూ తల దూరుస్తాడు.
ఇలా చాలా విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారాయన. గతంలో యమ్ ఎస్ రెడ్డి...తన రాసిన ఆటో బయోగ్రఫి లో తెలుగు ప్రముఖులపై విమర్శలు చేసి వారి కోపానికి కారణమయ్యారు. అలాగే ఈ పుస్తకం కూడా చాలా మంది సినిమా వారి మనస్సులను హర్ట్ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ పుస్తకాన్ని నిర్మాతగా తనవైపు చూడాలని, తను సినిమాలు చేసేటప్పుడు ఎంత క్షోభ అనుభవించానో గ్రహించాలని మురారి చెప్తున్నారు. మురారి సినిమాల్లో సీతామహాలక్ష్మి, గోరింటాకు, జానికిరాముడు, నారీ నారీ నడుమ మురారి వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications












