twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు, రాఘవేంద్రరావులపై నిప్పులు... ఓ నిర్మాత పుస్తకం

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత 'యువచిత్ర' బేనరుపై అనేక విజయవంతమైన చిత్రాలు తీసిన కాట్రగడ్డ మురారి తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ పుస్తకం విడుదల చేస్తున్నారని సినీ పరిశ్రమ గగ్గోలు ఎత్తతోంది. నవ్విపోదురు గాక అనే పేరుతో ఈ పుస్తకం తయారైంది. ఈ పుస్తకం లో ఆయన చిరంజీవి,రాఘవేంద్రరావు,రామానాయుడు,సంగీత దర్శకుడు చక్రవర్తి వంటి వారిని ఏకిపారేసారని చెప్తున్నారు. తన స్వీయ అనుభవాలుగా చెప్పబడుతున్న ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల అవుతుంది. ఈ పుస్తకం బయిటకు తేవద్దని పరిశ్రమలోని చాలా మంది మురారి గారిని వేడుకుంటున్నట్లు సమాచారం.

    ఇక ఈ పుస్తకంలో ఏమి కాంట్రావర్శి విషయాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందంటే...(ఈ విషయాలు ఉన్నాయని మురారి..ఓ టీవీ ఛానెల్ చర్చా వేదికలో ఒప్పుకున్నారు)

    చిరంజీవి వల్లే తెలుగు సినిమాల్లో పాటలు పాడయ్యాయి. అసభ్యతకు,రొమాన్స్ కు మధ్య తేడా తొలిగిపోయింది. ఉదాహరణకు రగులుతోంది మొగలిపొద పాట ని ప్రస్దావించారు.

    అలాగే నాగార్జున జానికి రాముడు సినిమాని ..నాగార్జున కుటుంబమే చెత్త అని అంది.

    సంగీత దర్శకుడు చక్రవర్తికి స్వరాలు రావు.

    రాఘవేంద్రరావు డబ్బు ఎగ్గొట్టాడు.

    చిరంజీవి అన్నిటిలోనూ తల దూరుస్తాడు.

    ఇలా చాలా విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారాయన. గతంలో యమ్ ఎస్ రెడ్డి...తన రాసిన ఆటో బయోగ్రఫి లో తెలుగు ప్రముఖులపై విమర్శలు చేసి వారి కోపానికి కారణమయ్యారు. అలాగే ఈ పుస్తకం కూడా చాలా మంది సినిమా వారి మనస్సులను హర్ట్ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ పుస్తకాన్ని నిర్మాతగా తనవైపు చూడాలని, తను సినిమాలు చేసేటప్పుడు ఎంత క్షోభ అనుభవించానో గ్రహించాలని మురారి చెప్తున్నారు. మురారి సినిమాల్లో సీతామహాలక్ష్మి, గోరింటాకు, జానికిరాముడు, నారీ నారీ నడుమ మురారి వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి.

    English summary
    A producer named Murari who produced dozens of movies on 'Yuva Chitra' banner (last movie 'Nari Nari Naduma Murari' with Balakrishna) has written an autobiography 'Navvi poduru gaaka'. This book aims word weapons at big wigs of Telugu industry including Megastar Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X