Vettaiyan Trailer Review: వేట్టయన్ ట్రైలర్ రివ్యూ.. రజనీకాంత్, అమితాబ్ హోరాహోరీగా!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరన్ నిర్మించిన చిత్రం వేట్టయన్: ది హంటర్. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్, మంజూ వారియర్, దుషారా విజయన్, రితికా సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే?
తమిళ డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ అవుతున్న వేట్టైయాన్ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా, అమితాబ్ బచ్చన్ న్యాయమూర్తిగా నటిస్తున్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. చట్టం, న్యాయానికి మధ్య జరిగే సంఘర్షణగా ఈ సినిమాకు జై భీమ్ దర్శకుడు టీజ్ జానవేల్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ సంగీతం అందించారు.

ఓ అమ్మాయిపై అత్యాచారం జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంగా సాగే కథగా ట్రైలర్ స్పష్టం చేసింది. అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ వ్యతిరేకించే న్యాయమూర్తిగా అమితాబ్.. న్యాయం ఆలస్యం కావొచ్చు. కానీ కచ్చితంగా బాధితులకు లభిస్తుందనే పంథాలో కనిపించారు. పోలీస్ ఆఫీసర్, న్యాయమూర్తికి జరిగిన పోరాటంలో తప్పు చేసిన వాడికి పోలీసుగా శిక్షించడాన్ని నా నుంచి ఎవరు ఆపలేరు అని బిగ్‌బీకి రజనీకాంత్ సవాల్ విసిరారు.


Click it and Unblock the Notifications











