ఫ్లాష్ బ్యాక్ : కారులో డ్రైవర్ నిద్రపోతున్నాడని.. వేటూరి అలా చేశారట!!
తెలుగు సినీ ప్రపంచం ఉన్నంతం వరకు వేటూరి సుందరరామ్మూర్తి పేరు చిరస్మరణీయంగా ఉంటుంది. వేటూరి సాహిత్యం గురించి చెప్పాలన్నా, ఆయన కలంలోంచి జాలువారిన పద సంపద, పాటల ప్రవాహాన్ని చెప్పాలన్నా ఒక్క రోజు సరిపోదు. అంతటి మహాకవి, పాటల రచయిత అయిన వేటూరి గారి వర్ఱంతి (మార్చి 23) సందర్భంగా ఆయన్ను ఎంతో మంది స్మరించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆయన రాసిన పద సంపత్తిని గుర్తు చేసుకుంటూ ఇష్టమైన పాటలలోని సాహిత్యాన్ని షేర్ చేస్తున్నారు.

సాహిత్యంతో నాటి గుర్తులు..
‘పరువపు.. ఉరవడి.. పరువిడి.. నీ ఒడి... కన్నుల నీరిడి కలిసిన.. మనసున సందెలు కుంకుమ చిందిన వేళా' అంటూ సాగరసంగమంలోని పాటలోని సాహిత్యాన్ని షేర్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇలా సోషల్ మీడియాలో వేటూరి పాటలను ఇష్టపడే వారు నాటి గుర్తులను నెమరువేసుకున్నారు.

నాటి సంగతి..
కథ, కవిత, నవల, నాటక, సినీ రచయిత అయిన దివాకర బాబు మాడభూషి వేటూరి గారిని గుర్తు చేసుకుంటూ నాడు జరిగిన ఓ విషయాన్ని షేర్ చేశాడు. వేటూరి గారితో జరిగిన సంభాషణను, నాడు వేటూరి గొప్పదనాన్ని తెలుసుకున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే..

ఆ స్టూడియో వద్ద..
‘ఒకసారి శ్రీ వేటూరి ! AVM స్టూడియో, మద్రాసు. నేను సంభాషణలు వ్రాసిన సినిమా షూటింగ్ జరుగుతోంది. సిగరెట్ కాల్చుకోవడం కోసం ఫ్లోర్ లో నుండి బైటకి వచ్చాను. ఆ పనిలో వుండగా శ్రీ వేటూరి గారు గబగబా నడుచుకుంటూ వచ్చారు. నేను సిగరెట్ పారేసి నమస్కరించాను. ప్రతి నమస్కారం చేసి బావున్నారా అని అడిగారు.
Recommended Video

నిద్రలో ఉన్నాడు అందుకే..
అంతలో ఒక బాయ్ ఆటో తీసుకు వచ్చాడు. వేటూరి గారు ఆటో ఎక్కుతుంటే "అదేంటి సార్ ఆటోలో ఏంటి మీ కారు వుంది కదా" అన్నాను. "ఉందండీ..సాంగ్ రికార్డింగ్ అయిపోయాక వచ్చి చూస్తే డ్రైవర్ గాఢంగా నిద్రపోతున్నాడు. పాపం నిద్ర లేపడం ఎందుకని ఆటోలో వెళ్తున్నా" అని పసిపాపడంత హాయిగా నవ్వేసి ఆటోలో వెళిపోయారు.' అని వేటూరి గారిది ఎంతో సున్నితమైన హృదయని నాడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











