‘Hari Hara Veera Mallu’లో అదే హైలైట్: పవన్ సినిమాలో దానికే ఎక్కువ ఖర్చు

రీఎంట్రీలో ఫుల్ స్పీడుతో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' మూవీతో ప్రేక్షకుల ముందకు వచ్చిన అతడు.. ఇది రిలీజ్ కాకముందే మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న 'హరిహర వీరమల్లు' అనే సినిమా ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ మొగల్ సామ్రాజ్యం నాటి కథతో తెరకెక్కుతోంది. దీని కోసం చార్మినార్, ఎర్రకోటతో పాటు మొగలాయీల సామ్రాజ్యపు ప్రాంగణాన్ని నిర్మించబోతున్నారట. ఇక ఈ సినిమా కోసం ఏకంగా రూ. 180 కోట్ల వరకూ ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'హరిహర వీరమల్లు' సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ హైలైట్‌గా నిలవబోతుందట. ఇందులో ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్ సీన్స్‌ ఉండబోతున్నాయని అంటున్నారు. అందుకే ఆ భాగానికే చాలా సమయం పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక, వీటి కోసమే దాదాపు రూ. 50 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఓ ప్రముఖ సంస్థకు వీఎఫ్ఎక్స్ పనులను కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని గ్రాఫిక్ వర్క్ ఎడిటింగ్ కూడా ప్రారంభం అయినట్లు సమాచారం. అవన్నీ ఎంతో క్వాలిటీగా వచ్చాయని సమాచారం.

VFX Highlight in Pawan Kalyans Harihara Veeramallu

భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీ కోహినూర్ డైమండ్ చుట్టూ తిరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో తొలిసారి పిరియాడిక్‌ జోనర్‌లో నటిస్తున్నాడు పవన్. ఇక, ఇందులో అతడు వజ్రాల దొంగగా నటిస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X