twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కశ్మీర్ వ్యతిరేకులతో చేతుల కలుపుతారా? అమీర్ ఖాన్ మెడకు బిగుస్తున్న రాజకీయ ఉచ్చు

    |

    బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చద్దా సినిమా కోసం టర్కి దేశానికి వెళ్లిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. టర్కి రాజధాని ఇస్తాంబుల్‌లో ఆ దేశ ప్రథమ పౌరురాలు ఎమైనా ఎర్డోగన్‌ను ఆగస్టు 15వ తేదీన కలుసుకోవడం ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారాయి. అమీర్, ఎమైన్ భేటీపై నెటిజన్లే కాకుండా వీహెచ్‌పీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీల నేతలు భగ్గమంటున్నారు. అమీర్ ఖాన్ భేటీ ఎందుకు వివాదాస్పదమైందంటే..

     పాకిస్థాన్‌తో స్పేహంగా ఉన్న టర్కీతో అమీర్ ఖాన్

    పాకిస్థాన్‌తో స్పేహంగా ఉన్న టర్కీతో అమీర్ ఖాన్

    ప్రస్తుత అంతర్జాతీయ సంబంధాల విషయానికి వస్తే భారత్‌కు బద్ద శత్రువైన పాకిస్థాన్‌కు టర్కీ ప్రధాని ఎర్డోగన్ స్నేహ హస్తం అందించారు. భారతీయ వ్యతిరేక శక్తులతో అమీర్ ఖాన్ భేటీ కావడంపై నెటిజన్లు తప్పుపడుతున్నారు. మన శత్రు రాజ్య అధినేతతో భారతీయ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ భేటీ అవుతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     ఇజ్రాయెల్ ప్రధానితో భేటికి అమీర్ నిరాకరణ

    ఇజ్రాయెల్ ప్రధానితో భేటికి అమీర్ నిరాకరణ

    ఇక గతంలో భారత్‌కు మిత్రదేశం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూతో కలువడానికి అమీర్ ఖాన్ నిరాకరించారు. అయితే ఇప్పుడు టర్కీ ప్రథమ పౌరురాలితో సమావేశమై ఆ దేశ అభివృద్ధి పథకాలకు సంబంధించిన విషయాలను చర్చిాంచారు. ఇదేట్ల సమంజయం అంటూ పలు రాజకీయ పార్టీల నేతలు, నెటిజన్లు భగ్గుమంటున్నారు.

    అసహనం, అభద్రతాభావం అంటూ అమీర్

    అసహనం, అభద్రతాభావం అంటూ అమీర్

    అమీర్ ఖాన్ ఇలా నెటిజన్లు, రాజకీయ పార్టీల ఆగ్రహానికి గురికావడం మొదటిసారి కాదు. 2015లో కొన్ని విషయాల తనకు అసహనం కలుగుతున్నది. నా భార్య కిరణ్ రావు, నా బిడ్డ దేశంలో నివసించాలంటే అభద్రతా భావానికి గురి అవుతున్నారు అని అమీర్ ఖాన్ వ్యాఖ్యలు చేయడం వివాదమైంది. ఆ సమయంలో విశ్వ హిందూ పరిషత్ ఆయన నటించిన దంగల్ సినిమా రిలీజ్ చేయవద్దంటూ నిరసన వ్యక్తం చేసింది.

     దేశ ద్రోహులతో చేతులు కలిపిన అమీర్

    దేశ ద్రోహులతో చేతులు కలిపిన అమీర్


    తాజాగా అమీర్ ఖాన్, ఎమైనా ఎర్డోగన్‌ భేటీపై వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ భన్సాల్ మాట్లాడుతూ.. భారతీయ నటులంటే ప్రేక్షకులకు ఎంతో గౌరవం. వారి నటన, సినిమాలను ఎంతో ఆదరిస్తారు. అలాంటి నటులు భారతీయ వ్యతిరేక విధానం అవలంభిస్తున్న టర్కీ దేశాధినేత భార్యతో భేటీ అయ్యారు. అమీర్ ఖాన్ తీరు భారతీయ సినీ ప్రేక్షకుల మనోభావాలను గాయపరిచింది. ఇలాంటి వారిపై మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారు.

    భారతీయ వ్యతిరేక దేశ నేతలతో భేటీనా?

    భారతీయ వ్యతిరేక దేశ నేతలతో భేటీనా?

    ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ మను సింఘ్వీ కూడా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ పేరు ఎత్తకుండానే తాజా భేటిని తప్పుపట్టారు. తయ్యిప్ ఎర్డోగాన్ భారతీయ వ్యతిరేకి. అతడి విధానాలు భారత్‌కు ముప్పుగా మారాయి. అలాంటి వ్యక్తులు, దేశాధినేతలతో సంప్రదింపులు, సమావేశాలను తప్పుపట్టాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.

    English summary
    VHP, Congress fires on Bollywood actor Aamir Khan’s meeting with Turkish First Lady Emine Erdogan on 15 August. VHP and Congress party leaders object and projected that meeting was Anti India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X