జూ.ఎన్టీఆర్ వికృతంగా, అసభ్యంగా... వీహెచ్‌పీ
ఎన్టీఆర్ తాజా చిత్రం 'బృందావనం' విడుదలకాకుండానే వివాదాల్లో ఇరుక్కుంటుంది. తాజాగా విహెచ్ పీ వారు కూడా రంగంలోకి దిగి.. 'బృందావనం' చిత్రంపై ప్రకటన చేసారు. 'బృందావనం'లో శ్రీకృష్ణున్ని అసభ్యంగా చిత్రీకరించారని, అది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విశ్వహిందూ పరిషత్ (ఆంధ్రప్రదేశ్ పశ్చిమ) విమర్శించింది. శ్రీకృష్ణున్ని అవమానపరిచేలా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రచార ప్రముఖ్ నోముల వినోద్, ప్రాంతీయ భజరంగ్‌దళ్ ప్రముఖ్ టి.యమన్ సింగ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ సినిమాలో శ్రీకృష్ణుని పాత్రలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వికృతంగా, అసభ్యంగా తారల మధ్యన నటించడం హిందూ జాతికే అవమానకరమన్నారు. అలాగే కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ కృష్ణుడు. ఆ మహానుభావున్ని అసభ్యకరంగా చిత్రీకరించడం హిందువుల భక్తిప్రపత్త్తులను బలహీన పర్చడమే అని వారు ఆరోపించారు.


Click it and Unblock the Notifications











