ఆ రోజు బాలకృష్ణకి శోభనం. అయితే అది జరగటం ఇష్టంలేని ప్రియమణి, బ్రహ్మానందంతో కలిసి ఓ ప్లాన్ చేస్తుంది. శోభనం గదిలో ఇచ్చే పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇద్దామని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే తన కోసం వయాగ్రా తెచ్చుకున్న బ్రహ్మానందం పొరపాటున స్లీపింగ్ పిల్స్ కి బదులు వయాగ్రా ఇచ్చేస్తాడు. చూసుకోకుండా ఓ నాలుగు పిల్స్ పాలల్లో కలిపి ఇస్తుంది ప్రియమణి. దాంతో అది తాగినప్పుడు బాలయ్యలో వచ్చే మార్పులు చూడాలి. ఈ సన్నివేశం ఈ రోజు(శుక్రవారం)రిలీజైన మిత్రుడు చిత్రంలోది. వయాగ్రా తీసుకున్న బాలకృష్ణ ఇబ్బంది పడుతూ, తన శరీరంలో పుట్టే మార్పులు చూపటాన్ని ప్రేక్షకులు ధియోటర్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదీ సంగతి.