Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ ని నెం 1 హీరో చేస్తానంటున్న ఫ్లాప్ హీరో!?
ఎప్పటికైనా తన తండ్రిలానే దర్శకత్వం చేస్తానంటూ చిరంజీవి తనయుడి సినిమాతో డైరెక్టర్ గా ముందుకొస్తానంటూ చెప్తున్నాడు. కోదండరామి రెడ్డి తనయుడు 'వైభవ్". 'గొడవ" తో చిత్రరంగ ప్రవేశం చేసిన వైభవ్ ఆశించినంత విజయాలు రాక పోయేసరికి తన తండ్రిలాగా డైరక్షన్ ఫీల్డ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత విడుదల అయిన 'సరోజ" కాస్త నిలబెట్టడంతో తిరిగి హీరో వేషాలు వేస్తానంటూ ఇటీవల విడుదల అయిన 'కాస్కో" లో నటించాడు.
డైరక్షన్ చేయడాన్ని విరమించుకుని మళ్లీ సినిమాలు చేస్తానంటున్న వైభవ్ త్వరలోనే కమర్షియల్ డైరెక్టర్ గా పేరు సాధిస్తానంటూ తను చేసే డాన్స్ ల్లోనూ చిరంజీవినే స్పూర్తిగా తీసుకుంటున్నాననీ చిరంజీవి అంటే ఇష్టమే కాదు ఎంతో ప్రాణమని చెబుతున్నాడు. అందుకే నాన్నగారు చిరంజీవిగారిని నెంబర్ వన్ చేస్తే. నేనూ డైరెక్షన్ చేసి తన కొడుకుని నెంబర్ వన్ చేస్తానంటున్నాడు. సో వైభవ్ కి అంత సీన్ ఉందంటారా ఒక్కసారి ముఖాన్ని అద్దంలో చూసుకొమ్మని సెటైర్లు విసురుతున్నారు సినీ విమర్షకులు.